Kajal Agarwal: సినీ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలలో నటిస్తున్నారు. త్వరలోనే శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో నటించిన సత్యభామ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఈమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు లేడీ ఓరియంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా జూన్ 7 న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర ఉన్న సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నెట్ ప్లిక్స్ ఓపెన్ చేసి మేజర్ సినిమా చూశానని తెలిపారు. ఈ సినిమాలో తాను లీనమైపోయానని నాకు తెలియకుండానే బాగా ఏడుస్తున్నానని తెలిపారు.
మేజర్ సినిమా..
ఇలా ఈ సినిమా చూసిన తర్వాత వెంటనే ఫారిన్ లో ఉన్నటువంటి తన భర్తకు ఫోన్ చేసి నేను శశికిరణ్ తిక్క దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నానని తెలిపాను. అయితే భగవంత్ కేసరి సినిమా షూటింగ్ సమయంలో కిరణ్ సత్యభామ సినిమా కథతో నా వద్దకు వచ్చారు. కేవలం వారికి ఒక గంట సమయం మాత్రమే ఇచ్చాను కానీ ఆ సినిమా కథ చెబుతున్నప్పుడు లీనమైపోయి మూడు గంటల పాటు స్టోరీ విన్నానని ఈ సందర్భంగా కాజల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…