తెలుగు బుల్లితెర షోలలో గత 8 సంవత్సరాల నుంచి ఎంతో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ ఒకటని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ స్టార్ సెలబ్రిటీలగా గుర్తింపు పొంది తమ కెరీర్లో ఉన్నత స్థానానికి వెళ్లారు. ఎంతోమంది జీవితాలకు మంచి గుర్తింపును సంపాదించిన కార్యక్రమంగా జబర్దస్త్ కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు.
ఈ కార్యక్రమానికి ఎంతో మంది కమెడియన్లు వస్తున్నారు వెళ్తున్నారు.కానీ ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి జడ్జిగా రోజా వ్యవహరిస్తూ తన మార్క్ ఏంటో నిరూపించుకున్నారు. స్కిట్ లను బాగా పరిశీలిస్తూ సందర్భానుసారంగా స్పందించడం ఈ జడ్జి నైజమని చెప్పవచ్చు. తాజాగా ఈ వారం ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఇమ్మానియేల్, వర్ష చేసిన స్కిట్ పై రోజా స్పందించారు. ఈ సందర్భంలో వర్షనుఉద్దేశించి రోజా కామెంట్ చేయగా వర్ష కన్నీరు పెట్టుకోవడం ఈ ప్రోమో కు హైలెట్ గా నిలిచింది.
జబర్దస్త్ జోడిలలో ఇమ్మానియేల్ -వర్ష జోడిలకు ఎంతో పాపులారిటీ ఉంది.వీరిద్దరి చూడటానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయినప్పటికీ కెమెరా ముందు వీరు చేసే రొమాంటిక్ సన్నివేశాలు చూసి అప్పుడప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం నడుస్తున్నదనే సందేహాలు తలెత్తుతుంటాయి. అయితే విషయంపై వీరిద్దరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో చూస్తే మాత్రం వీరిద్దరి మధ్య లవ్ యాంగిల్ నడుస్తోందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోలో భాగంగా వర్ష ఇమ్మానియేల్ ప్రేమించుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరి పెళ్లి చేసుకోలేక పోయారు. దీంతో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేక పోయానని వర్షా ఎంతో బాధపడుతుంది. ఈ స్కిట్ పూర్తికాగానే రోజా స్పందిస్తూ వర్ష పై కామెంట్స్ చేశారు. స్కిట్ లో భాగంగానే ఇమ్మానియేల్ కు వేరే వారితో పెళ్లి అయితే ఇంత బాధ పడుతున్నావు… నిజంగానే ఇమ్మూకు వేరే వారితో పెళ్లి అయితే నీ పరిస్థితి ఏంటి? అని అడగడంతో వర్ష ఎంతో ఎమోషనల్ గా కన్నీరు పెట్టుకున్నారు. వర్షను ఆ విధంగా చూసినా ఇమ్మానియేల్ తెగ బాధపడిపోయారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇన్ని రోజులు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని సందేహపడుతున్న అభిమానులకు ఈ స్కిట్ మరింత బలాన్ని చేకూర్చిందని చెప్పవచ్చు.
ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…
వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…
వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…
రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…
ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…