Jabardasth : తెలుగు బుల్లితెర మీద ప్రసారమావ్వుతూ అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా టాప్ రేటెడ్ ప్రోగ్రాములలో ఒకటిగా రాణిస్తోంది జబర్దస్త్. ఈ ప్రోగ్రాం మొదలు అయినప్పటి నుండి చాలకాలం నాగ బాబు, రోజా జడ్జీలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే మంత్రి పదవి తరువాత రోజా, కొన్ని కారణాలతో నాగబాబు షో కి దూరం అయ్యారు. వీరి తరువాత మనో, మీనా, ఇంద్రజ, ఖుష్బు, సంఘవి లాంటి వాళ్లు వచ్చారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ కు మరో సినీ నటి రాబోతున్నారు.
సింగర్ మనో ప్లేస్ లోకి కొత్త జడ్జి…
ప్రస్తుతం ఇంద్రజ ఒక్కటే ఈ షో లో చాలా రోజుల నుండి కొనసాగుతోంది. కొత్తగా వస్తున్న మిగిలిన వారు మళ్ళీ కనిపించట్లేదు. ఇపుడు సింగర్ మనో గారి స్థానంలోకి ఒక సినీ నటి వచ్చి ఆశ్చర్య పరుస్తోంది. తాజాగా వచ్చిన ప్రమోలో మనో స్థానంలో నటి ప్రగతి కనిపిస్తున్నారు. దీన్ని చూసి అందరూ ఆశ్చర్యంలో ఉన్నారు. ఇక పంచులతో ప్రోమో కూడా బాగా ఆకట్టుకుంటోంది.
ఇక ప్రగతి అయినా జబర్దస్త్ జడ్జి గా ఎక్కువ రోజలు వస్తారో లేదో చూడాలి. ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటిగా అభిమానులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమాల ఎంపిక విషయంలో మాత్రం ఈ మధ్య చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో అయితే ప్రగతి గురించి చెప్పక్కరలేదు. డాన్స్ వీడియోలు, తన వర్కౌట్ కి సంబందించిన వీడియోలతో అభిమానులకు ట్రీట్ ఇస్తూనే ఉంటారు. అయితే ప్రగతి అయినా జడ్జి గా సెటిల్ అవుతుందా లేదా అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…