Featured

RGV : రాజమౌళి ఇండస్ట్రీ నాశనం అయ్యే పనులు రెండు చేసాడు… అందుకే ప్రేక్షకులు థియేటర్ కి రావడం లేదు : ఆర్జీవి

RGV : ఇండస్ట్రీ లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం గురించి రామ్ గోపాల్ వర్మ తన మార్కు కామెంట్స్ చేసారు. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ గురించి మాట్లాడుతూ నిర్మాతకు ఒక ఆర్టిస్ట్ ను సినిమాలో పెట్టుకుంటే సినిమాకు ప్లస్ అవుతుంది అన్నపుడు ఖచ్చితంగా అతనికి ఇవ్వడానికి వెనుకాడడు. అలాంటప్పుడు డిమాండ్ ఉన్న ఒక ఆర్టిస్ట్ ఎందుకు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి. ఇక ప్రేక్షకులు లేకపోతే సినిమా ఉండదు అంతే కానీ నిర్మాత లేకపోతే కాదు వంటి హాట్ కామెంట్స్ చేసారు రామ్ గోపాల్ వర్మ.

రాజమౌళి ఇండస్ట్రీని నాశనం చేసాడు…

ఇక సినిమా చూడడానికి ఒక ప్రేక్షకుడు థియేటర్ కి రాకపోడానికి కారణాలను వివరిస్తూ టికెట్ రేట్స్, ఓటీటీ మధ్యమాలు కారణం కాదని అభిప్రాయపడ్డారు. టికెట్ రేట్లు ఎక్కువున్న సమయంలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వంటి సినిమాలను చూసారు. వాటి తరువాత వచ్చిన ఆచార్య ను జనాలు థియేటర్ కి వచ్చి చూడలేదు. టికెట్ రేట్లు, ఓటీటీ ఇవన్నీ స్పెక్యూలేషన్ మాత్రమే నిజాలు కావు. నా అభిప్రాయం ప్రకారం సినిమా చుడడానికి జనాలు రాకపోడానికి కారణం రాజమౌళి చేసిన రెండు తప్పులు అంటూ చెప్పారు. ఒక తెలుగు సినిమా తీస్తే రెండు వేల కోట్ల మార్కెట్ చేయగలదని రాజమౌళి చూపించాడు. ఇక ఒక సినిమా క్వాలిటీ విషయంలో మరే సినిమాకు అందని ఎత్తులో ఉన్నాడు.

దీనివల్ల ఆర్ఆర్ఆర్ వంటి సినిమా చూసాక మిగిలిన సినిమాలను చూడాలని సగటు ప్రేక్షకుడికి అనిపించడం లేదు. తెలుగు లో ఒక సామెత ఉంది కదా రాజుని చూసిన కళ్ళతో మొగుణ్ణి చూసాక మొత్తబుద్దేసింది అని అలా ఉంది పరిస్థితి. అలాంటి క్వాలిటీ సినిమా చూసాక మిగిలిన సినిమాలు ఒక పెద్ద హీరోవే అయినా జనాలకు చూడాలనిపించడం లేదు. ఇక ప్రొడక్షన్ కాస్ట్ తగ్గాలని వీళ్ళే కోరుకుంటున్నారు, అదే సమయంలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఉండే సినిమా తీయాలనీ అంటున్నారు అంటూ నిర్మాతల గురించి అన్నారు. ఇండస్ట్రీ లో ఇప్పుడున్న డైరెక్టర్స్ రాజమౌళి ఎప్పుడు ప్లాప్ అందుకుంటాడా అని ఎదురుచూస్తున్నారు. రెండో విషయం రాజమౌళి ని ఎప్పుడు అందుకుంటాం అని ఆలోచిస్తున్నారు. ఇక సినిమా తీస్తున్న వాళ్ళు వాళ్ల సినిమాలో లోపాలను చూడటం లేదు సినిమా టికెట్ ధర, ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ను సాకుగా చూపుతున్నారు అంటూ కామెంట్స్ చేసారు ఆర్జీవి.

Bhargavi

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

8 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

8 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

8 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

8 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

8 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

8 hours ago