Categories: FeaturedMovie News

Jabardasth Auto Ram Prasad : నా ఆరోగ్యానికి ఏమైందంటే… క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్

Jabardasth Auto Ram Prasad : జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ లైంలైట్ లోకి వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుని కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. ఇది ఒక కోణం అయితే మరో కోణం కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ జబర్దస్త్ ద్వారా నుండి నేమ్, ఫేమ్ సంపాదించుకున్న తరువాత జబర్దస్త్ నుండి వెళ్లిపోయినవారు ఉన్నారు. మొదటి నుండి జబర్దస్త్ లో ఉండి సినిమా అవకాశాలు వినియోగించుకుంటూనే మరో వైపు జబర్దస్త్ అలాగే శ్రీ దేవి డ్రామా కంపెనీ అంటూ షోస్ చేసుకుంటున్న కమెడియన్ రామ్ ప్రసాద్. ఆటో పంచుల పేరుతో రామ్ ప్రసాద్ వేసే పంచులకు మంచి పేరుంది. రైటర్ గా మంచి పంచులను తన స్కిట్స్ లో రాసే ప్రసాద్ కి ఈ మధ్య ఆరోగ్యం బాగోలేదని సోషల్ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. వాటి పైన రామ్ ప్రసాద్ స్పందించారు.

అందుకే అలా రూమర్స్ వచ్చాయి…

రామ్ ప్రసాద్ కి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటూ ఏవేవో వార్తలను సోషల్ మీడియాలో అల్లేసిన నేపథ్యంలో అసలు ఏం జరిగిందో ఆయన వివరించారు. కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మణికొండ బ్రాంచ్ ఓపెనింగ్ కి వచ్చిన రామ్ ప్రసాద్ తన ఆరోగ్యం గురించి మాట్లాడారు. తనకు ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదని కేవలం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నానని, దాన్ని తీసుకుపోయి బ్రెయిన్ ట్యూమర్ అంటూ కథలు అల్లేసారని చెప్పారు.

సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్ లో థంబ్ నైల్స్ చూసి మోసపోకండి అంటూ చెప్పారు. థంబ్ నైల్స్ లో ఒకటి రాసుంటుంది ఓపెన్ చేస్తే వేరే ఉంటుంది, వ్యూస్ కోసం నాకు బ్రెయిన్ ట్యూమర్ అంటగట్టారు అంతే. నేను జబర్దస్త్ చేస్తూ మరో వైపు సినిమాల్లోను బిజీగా ఉన్నానంటూ రామ్ ప్రసాద్ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago