Kiraak RP: ప్రస్తుతం ఎక్కడ చూసినా కిరాక్ ఆర్పీ పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగిపోతుంది. ఇందుకు గల కారణం ఈయన గత కొద్దిరోజులుగా జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చే ఆ కార్యక్రమం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఇలా విమర్శల ద్వారా వార్తల్లో నిలిచిన అనంతరం ఏ బుల్లితెర కార్యక్రమాలలోనూ పాల్గొనకుండా ఏకంగా రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు.
నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో ఈయన వివిధ రకాల చేపలు పులుసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇలా ఆర్పీచేపల పులుసుకు అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి డిమాండ్ రావడంతో ఈయన రెస్టారెంట్ ముందు కస్టమర్లు క్యూ కట్టారు. అయితే కష్టమర్లకు సరిపడా ఫుడ్ ప్రిపేర్ చేయలేకపోతున్న నేపథ్యంలో ఈయన కొంత కాలం పాటు రెస్టారెంట్ మూసివేసి అనంతరం తిరిగి ఓపెన్ చేశారు.
ఈ విధంగా ఈయన రెస్టారెంట్ ఎంతో సక్సెస్ అవుతుండగా కొందరు పనిగట్టుకుని తన రెస్టారెంట్ పై కుట్ర పడుతున్నారని కావాలనే నెగిటివ్ గా రివ్యూ ఇస్తున్నారంటూ ఈయన మండిపడ్డారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆర్పీ తన బిజినెస్ ఎంతో సక్సెస్ అయిందని తనని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా అదిరే అభి ఓవర్సీస్ లో కూడా మీరు చేపల పులుసు పెట్టాలని కోరుకున్నారు దానికి మీ సమాధానం ఏంటి అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఆర్పీ సమాధానం చెబుతూ తన చేపల పులుసు రెస్టారెంట్ హైదరాబాదులోనే కాకుండా అమెరికాలో కూడా ఏర్పాటు చేయబోతున్నానని అక్కడ ఉన్నటువంటి తెలుగు వారికి తన చేపలు పులుసు రుచి చూపించబోతున్నానని తెలిపారు.అయితే అందుకు కాస్త సమయం పడుతుంది. నాకు ఇందులో మరింత అనుభవం మ్యాన్ పవర్ కూడా కావాలని త్వరలోనే ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలను తెలియజేస్తాను అంటూ ఆర్ పి ఈ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…