Kirrak RP : జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన కిర్రాక్ ఆర్పి అందులో నుండి బయటకు వచ్చాక ఇతర ఛానెల్స్ లో కొద్దిరోజులు షోస్ చేసాడు. ఇక జబర్దస్త్ గురించి మల్లెమాల గురించి బాగా విమర్శించి వైరల్ అయ్యాడు. ప్రస్తుతం కూకట్ పల్లి హైదరాబాద్ లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో ఒక కర్రీ పాయింట్ పెట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. కట్టెల పొయ్యి మీద వండిన నెల్లూరు నుండి తెప్పించిన చేపలతో చేసిన పులుసుకు బాగానే డిమాండ్ క్రియేట్ అయింది. దీంతో ఇప్పుడు మరో బ్రాంచ్ ను ఏర్పాటు చేసారు ఆర్పీ. ఇక జబర్దస్త్ గురించి అలాగే మల్లెమాల సంస్థ గురించి తాను చేసిన కామెంట్స్ ఇప్పటికీ కట్టుబడి ఉన్నానంటున్న ఆర్పీ రాకింగ్ రాకేష్ చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చాడు.
రాకింగ్ రాకేష్ చరిత్ర నాకు తెలుసు…
కిర్రాక్ ఆర్పీ దూకుడు ఎక్కువ, ఆవేశంతో మాట్లాడటం కామన్. జబర్దస్త్ షో వల్ల మేమెంత లాభపడ్డామో జబర్దస్త్ కూడా అంతే లాభపడిందంటూ హాట్ కామెంట్స్ చేసిన ఆర్పీ మల్లెమాల వాళ్ళు ఫుడ్డు సరిగా పెట్టారంటూ హాట్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో కొంతకాలం బాగా వైరల్ అయ్యాడు. ఇక ఆ కామెంట్స్ పైన స్పందించిన వారంతా ఇప్పుడు ఆర్పీ చేపల పులుసు టేస్ట్ చేయడానికి వస్తుండటం విడ్డూరం. అయితే జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జబర్దస్త్ మాకు పెట్టిన భిక్ష నేడు మా కెరీర్ అంటూ మాట్లాడాడు.
దీని గురించి స్పందిస్తూ వాడికి భిక్ష పెట్టిందేమో నాకు కాదు, ఒకడికి అవకాశం మరొకరిది అవసరం, అదే జబర్దస్త్ తో మాకున్నది. నా టాలెంట్ వాళ్లకు అవసరం, నాకు ఆ స్టేజి ఒక అవకాశం అంతే భిక్ష కాదు అంటూ మాట్లాడాడు. ఇక రాకింగ్ రాకేష్ గురించి మాట్లాడుతూ వాడి చరిత్ర అంతా తెలుసు, నేను మాట్లాడితే ఉ** పడిపోతుంది వాడికి. నా ముందు వాడు చిన్న ఆర్టిస్టని వాడే ఒప్పుకున్నాడు కదా అంటూ ఫైర్ అయ్యాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…