బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో కేవలం కమెడియన్లు నవ్వులు పండించడమే కాకుండా ఎవరికైనా ఆపద వస్తే అందరూ ఒక్కటై వారిని కాపాడుకోవడంలో ముందుంటారని ఎన్నోసార్లు నిరూపించబడింది. తాజాగా ఓ కమెడియన్ విషయంలో కూడా అదే జరిగింది.గత కొన్ని నెలల నుంచి జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ జీవన్ కనిపించలేదు. అందుకు గల కారణం అతడు అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని నెలల నుంచి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కమెడియన్ జీవన్ కోలుకొని తిరిగి ఎక్స్ ట్రా జబర్దస్త్ వేదికపై సందడి చేశాడు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మి చాలా రోజుల తర్వాత అనారోగ్యం నుంచి కోలుకున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి రావడం మీకు ఎలా ఉందని అడగడంతో జీవన్ ఎంతో భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యాడు. అసలు ఈ కార్యక్రమానికి వస్తానని అనుకోలేదు. డాక్టర్లు చనిపోతానని చెప్పారు. ఈరోజు ఇక్కడ ఉండాలంటే అంతటికీ కారణం జబర్దస్త్ టీం మెంబెర్స్ అని తెలియజేశారు.
ఆరోజు వీళ్ళందరూ ఆదుకోవడంతోనే ఈ రోజు ఈ వేదికపై ఉన్నానని జీవన్ ఎమోషనల్ అయ్యారు.డాక్టర్లు ఇంజక్షన్ లకి కూడా సహకరించడం లేదని ఇతను చనిపోతాడని చెప్పడంతో అమ్మ భోరున ఏడ్చింది. చిన్న బాబు కూడా ఉన్నాడు డాక్టర్లు బతకడం కష్టం అని చెబితే వీళ్లంతా కలిసి బతికించారు మేడమ్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
కేవలం జీవన్ ఒక్కడు మాత్రమే కాదు. మా జబర్దస్త్ ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా మేమందరం ఇలాగే ఉంటామని గెటప్ సీను ఎమోషనల్ అయ్యాడు.ప్రస్తుతం ఈ వారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో ఎంతో ఎమోషనల్ గా సాగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…