Jabardasth Pavitra: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంతోమందికి మంచి ప్లాట్ ఫామ్ గా నిలుస్తోంది. ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది తమలో ఉన్న టాలెంట్ నీ నిరూపించుకుంటూ కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా ఈ కామెడీ షో ద్వారా సుధీర్ , ఆది, శ్రీను, రాంప్రసాద్ వంటి ఎంతోమంది కమెడియన్లు బాగా పాపులర్ అయ్యారు.
జబర్దస్త్ ప్రారంభమైన కొంతకాలం వరకు ఈ కామెడీ షోలు మగవారు లేడీ గెటప్స్ వేసుకొని కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరించేవారు. అయితే ప్రస్తుతం మాత్రం జబర్దస్త్ లో పరిస్థితిలో మొత్తం తారుమారు అయ్యాయి. చాలా కాలం పాటు కేవలం మగవారికి మాత్రమే పరిమితమైన ఈ జబర్దస్త్ కామెడీ షో లో ప్రస్తుతం ఆడవారు కూడా తమ కామెడీతో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం ఈ జబర్దస్త్ కామెడీ షో లో వర్ష, ఫైమా, రోహిణి, పవిత్ర, రీతు చౌదరి వంటి వారు లేడీ కమెడియన్లుగా బాగా పాపులర్ అయ్యారు.
ఇక పవిత్ర జబర్దస్త్ లో సందడి చేస్తూ తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా అందరి సెలబ్రిటీల అలాగే ఇటీవల పవిత్ర కూడా సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా పవిత్ర తన షూటింగ్ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకొనే పనిలో బిజీగా ఉంది.
ఈ క్రమంలో తాజాగా తనకు పెళ్లి ఫిక్స్ అయిందని చెబుతూ పెళ్లి కోసం తనకి కాబోయే వాడితో కలిసి షాపింగ్ మాల్ కి వెళ్లి సందడి చేసింది. పెళ్లి షాపింగ్ కోసం ఒక షాపింగ్ మాల్ కి వెళ్లిన పవిత్ర అక్కడ చేసిన సందడి అంతా ఇంతా కాదు. వీరు వేసే పంచ్ డైలాగులకి షాపింగ్ మాల్ లో పని చేసే వారు కూడా తెగ నవ్వుకున్నారు. ముఖ్యంగా పట్టు చీర కట్టుకొని తన కన్నా తన స్నేహితురాలు చాలా అందంగా ఉంటూ పవిత్ర చేసిన కామెంట్స్ అందరికీ నవ్వు తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…