Tv Actress Srivani: ఇండస్ట్రీలో సినిమా నటీనటులతో పాటు సీరియల్ నటీనటులకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సీరియల్స్ లో నటిస్తూ ప్రతిరోజు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్ నటీనటులకు హీరో హీరోయిన్లు స్థాయిలో క్రేజ్ ఉంటుంది. ఇలా ఎన్నో ఏళ్లుగా సీరియల్స్ లో నటిస్తూ నటిగా గుర్తింపు పొందిన బుల్లితెర నటి శ్రీ వాణి కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నటిగా మంచి గుర్తింపు పొందింది.
ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ లో నటిస్తూ.. అలాగే బుల్లితెర మీద ప్రసారమవుతున్న అనేక టీవీ షోలో సందడి చేస్తూ బిజీగా ఉంది. అంతేకాకుండా ఇటీవల సొంత యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇక ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన విశేషాలతో పాటు తన కుటుంబానికి సంబంధించిన విశేషాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో హోం టూర్ వీడియోస్, షాపింగ్ వీడియోస్ అంటూ ప్రతిరోజు తన సందడి చేశారు రోజువారి జీవితంలో జరిగే విశేషాల గురించి వీడియో రూపంలో యూట్యూబ్ లో షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.
ఇక జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కామెడీ షోలలో కూడా తన భర్త తో కలిసి సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఏదో ఒక వీడియోని షేర్ చేస్తున్న శ్రీవాణి ఇటీవల తన నూతన గృహప్రవేశానికి సంబంధించిన షాపింగ్ విశేషాలను కూడా వీడియో రూపంలో పంచుకుంది. ఇక ఇటీవల శ్రీవాణీ నూతన గృహప్రవేశానికి సంబంధించిన వేడుక చాలా ఘనంగా జరిగింది. ఈ గృహప్రవేశ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గృహప్రవేశ కార్యక్రమానికి పలువురు సీరియల్ నటీనటులతో పాటు కమెడియన్లు కూడా హాజరై సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. చాలాకాలంగా సొంతింటి కళ నెరవేర్చుకోవటం కోసం శ్రీవాణి దంపతులు చాలా కష్టపడ్డారు. ఇంతకాలానికి వారి కల నెరవేరటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీవాణికి పలువురు సెలబ్రిటీలతో పాటు ఆమె అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…