Featured

Jabardasth Vinod : లేడీ గెటప్ వేస్తుంటే నా భార్య ఏమందంటే… అమ్మ ఏడ్చేసింది… ఫోన్ చేయడం కూడా… ఇంట్లో నుండి బయటకు రావడానికి కారణం అదే : జబర్దస్త్ వినోద్

Jabardasth Vinod : జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ లైంలైట్ లోకి వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుని కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. ఇది ఒక కోణం అయితే మరో కోణం కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ జబర్దస్త్ ద్వారా నేమ్ ఫేమ్ సంపాదించుకున్నా ఆ తరువాత జబర్దస్త్ నుండి వెళ్లిపోయినవారు ఉన్నారు. మొదటి నుండి జబర్దస్త్ అనగానే బాగా ఫేమస్ అయింది మాత్రం లేడీ గేటప్స్ వేసే వినోదిని, సాయి, పావని వంటి వారు మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా వీరిలో వినోద్ ను అందరూ అమ్మాయి అనే అనుకుని పొరపాటు పడ్డారు. చమ్మక్ చంద్ర టీంలో చంద్ర కి పెయిర్ గా ఎన్నో స్కిట్స్ చేసిన వినోద్ జబర్దస్త్ కి క్వీన్ అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ వినోద్ అనారోగ్యంతో బరువు తగ్గి ఇపుడిపుడే కోలుకుంటున్నాడు.

లేడీ గెటప్ పై నా భార్య ఏమందంటే…

జబర్దస్త్ లో ఎంతో మంది లేడీ గెటప్ లు వేసినా బాగా పాపులర్ అయింది మాత్రం వినోదే. వినోదిని గా చమ్మక్ చంద్ర గ్రూప్లో అలరించిన వినోద్ అమ్మాయిలు కూడా అంత గ్లామరస్ గా ఉండరెమో అనేలా ఉంటాడు. జబర్దస్త్ మెయిన్ కమెడియన్స్ ఎంత పేరు తెచ్చుకున్నారో వినోద్ కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తన పెళ్లి అయ్యేవరకు వినోద్ లేడీ గేటుప్స్ వేస్తాడు కాబట్టి తేడా అనే మాటలు వినిపించేవి. ఇక పెళ్లి చేసుకున్నపుడు తన భార్య దగ్గర కూడా ఇలాంటివే మాట్లాడారంటూ వినోద్ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. నా భర్త ఏంటో నాకు తెలుసు మీకు నేను ప్రూవ్ చేయాల్సిన పని లేదు అంటూ వినోద్ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళ నోర్లు మూయించిదట వినోద్ భార్య.

ఇక ప్రస్తుతం లంగ్స్ ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వినోద్ తనకు ఆరోగ్యం బాగోలేనప్పటి పరిస్థితుల గురించి మాట్లాడుతూ చుట్టూ నా దగ్గర ఉన్నవాళ్లు బాగా ధైర్యం చెప్పారంటూ చెప్పాడు. ఇక వినోద్ వాళ్ళ అమ్మ బాగా ఏడ్చింది కానీ వినోద్ ముందు ఏడిస్తే భయపడతాడు అని వినోద్ తో మాట్లాడటం మానేసిందట. ఫోన్ ఎపుడో ఒకసారి చేసి ఎలా ఉన్నావ్ అని అడుగుతారట. చికిత్స కోసం బాగానే ఖర్చు అయినా నా కుటుంబాన్ని నేను పోషించుకోగలను, ఎవరి ముందర చేయి చాప్పాల్సిన పని లేదు అంటూ వినోద్ తెలిపారు. తాను మందులు వాడుతూనే ప్రస్తుతం మళ్ళీ పని చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. మళ్ళీ ఈవెంట్స్ కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago