Movie News

Jabardasth Vinod: జబర్దస్త్ ద్వారా సంపాదించినది మొత్తం కోల్పోయాను.. నమ్మినవారే నట్టేట ముంచారు : జబర్దస్త్ వినోద్

Jabardasth Vinod: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో వినోద్ ఒకరు. ఈయన లేడీ గెటప్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు.ఇలా లేడీ గెటప్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వినోద్ ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలో కనిపించడం లేదు.

ఈయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతూ గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనటువంటి వినోద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను ఎదురుకుంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ తాను జబర్దస్త్ లో కష్టపడి పైసా పైసా కూడా పెట్టినది మొత్తం పోగొట్టుకున్నానని తెలిపారు. సొంత ఇల్లు కొనుక్కోవాలని ఇంటి ఓనర్ కు 13 లక్షల రూపాయలు చెల్లించాను. అయితే తాను తనని మోసం చేశారని, తన డబ్బు తిరిగి చెల్లించమంటే ఇవ్వనని మోసం చేశారని వినోద్ తెలిపారు.

Jabardasth Vinod: 21 లక్షల రూపాయలు నష్టపోయాను…


ఇక తెలిసిన ఓ వ్యక్తి దగ్గర ఐదు లక్షలు అప్పు చేస్తే అందుకు తాను షూరిటీగా ఉన్నానని, ఆఅప్పు తను చెల్లించకపోవడంతో షూరిటీగా ఉండడంతో చివరికి తానే ఐదు లక్షల అప్పు చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. ఇక అనారోగ్య సమస్యల కారణంగా వైద్యం కోసం దాదాపు మూడు లక్షలు ఖర్చు పెట్టుకున్నానని తెలిపారు. ఇలా నమ్మిన వారే తనని మోసం చేయడంతో సుమారు 21 లక్ష రూపాయలు నష్టపోయాయని వినోద్ ఈ సందర్భంగా తాను పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు గురించి తెలియజేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago