Namrata: మహేష్ బాబు భార్యగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నమ్రత గురించి పరిచయం అవసరం లేదు..నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈమె మహేష్ బాబుతో సినిమా చేసి అనంతరం ఆయన ప్రేమలో పడ్డారు.మహేష్ బాబు వివాహం జరిగిన తర్వాత ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై కేవలం ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఒక మంచి తల్లిగా భార్యగా పేరు సంపాదించుకున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ మహేష్ బాబుతో పెళ్లి జరగడం తన జీవితంలో ఎంతో హ్యాపీ మూమెంట్ అని తెలిపారు.తనని పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితమే మారిపోయిందని వెల్లడించారు. మహేష్ బాబు పెళ్లి గురించి ఎంతో క్లారిటీతో ఉన్నారు పెళ్లి తర్వాత సినిమాలలోకి రాకూడదని చెప్పారు.
పెళ్లి జరిగిన తర్వాత ఒక భార్యగా తల్లిగా నా ధర్మాన్ని నిర్వర్తించడం కోసమే నేను ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని తెలిపారు. ఇక మహేష్ బాబు నటించిన సినిమాలలో తనకు పోకిరి సినిమా చాలా ఇష్టం అని తెలిపారు.ఇక పిల్లల విషయానికి వస్తే గౌతమ్ జన్మించిన సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని అసలు గౌతం బతకడం కష్టమని డాక్టర్లు చెప్పినప్పుడు ఆ సమయంలో మేము చాలా ఇబ్బందులు పడ్డామని అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
సితార మాకు అన్ వాంటెడ్ బేబీ. మేము తనని కనాలని అనుకోలేదు. అయితే ఇప్పుడు సితార కనుక మా జీవితంలో లేకపోతే మా జీవితాలు ఎప్పటికీ అసంపూర్తిగా ఉండేదని సితార గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…