Political News

Pawan Kalyan: జగన్ సారా వ్యాపారి.. వచ్చేది రామ రాజ్యమే.. సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్!

Pawan Kalyan: టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో చిలకలూరిపేట స‌మీపంలోని బొప్పూడిలో నిర్వ‌హించిన ప్రజాగళం భారీ సభను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాబోయే కురుక్షేత్ర సమరం తర్వాత ఏపీలో రాబోయేది రామ రాజ్యమేనని తెలిపారు. ప్రస్తుతం రావణాసురు పాలన సాగుతుందని త్వరలోనే రామరాజ్యం వస్తుందని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అధికారం డబ్బు అండతో విర్రవీగిపోతున్నారని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి రేటు పూర్తిగా పడిపోయిందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఒక సంక్షేమం లేదని అభివృద్ధి జరగలేదని నిరుద్యోగం పెరిగిపోయిందని తెలిపారు. ఈ కురుక్షేత్ర యుద్ధం తర్వాత రామరాజ్యం రాబోతుందని తెలిపారు. ఇక దేశమంతా డిజిటల్ రంగంలో ముందుకు దూసుకుపోతూ ఉండగా జగన్మోహన్ రెడ్డి మాత్రం మద్యం దుకాణాల వద్ద ఇంకా నగదు బదిలీ చేపడుతూ భారీగా దోచుకుంటున్నారని తెలిపారు. ఈయన ఒక సారా వ్యాపారి అంటూ పవన్ ఎద్దేవా చేశారు.

డ్రగ్స్ రాజధాని..
కేవలం మద్యం విషయంలో మాత్రమే కాదు ఇసుక తవ్వకాలలో కూడా జగన్ బినామీలు సుమారు 40 వేల కోట్ల వరకు దోచుకున్నారని పవన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాజధానిగా మారిపోయింది అంటూ జగన్ పరిపాలనపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు కురిపిస్తూ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అంటూ ఈ సందర్భంగా పవన్ తమ గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago