Pawan Kalyan: టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం భారీ సభను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాబోయే కురుక్షేత్ర సమరం తర్వాత ఏపీలో రాబోయేది రామ రాజ్యమేనని తెలిపారు. ప్రస్తుతం రావణాసురు పాలన సాగుతుందని త్వరలోనే రామరాజ్యం వస్తుందని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అధికారం డబ్బు అండతో విర్రవీగిపోతున్నారని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి రేటు పూర్తిగా పడిపోయిందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఒక సంక్షేమం లేదని అభివృద్ధి జరగలేదని నిరుద్యోగం పెరిగిపోయిందని తెలిపారు. ఈ కురుక్షేత్ర యుద్ధం తర్వాత రామరాజ్యం రాబోతుందని తెలిపారు. ఇక దేశమంతా డిజిటల్ రంగంలో ముందుకు దూసుకుపోతూ ఉండగా జగన్మోహన్ రెడ్డి మాత్రం మద్యం దుకాణాల వద్ద ఇంకా నగదు బదిలీ చేపడుతూ భారీగా దోచుకుంటున్నారని తెలిపారు. ఈయన ఒక సారా వ్యాపారి అంటూ పవన్ ఎద్దేవా చేశారు.
డ్రగ్స్ రాజధాని..
కేవలం మద్యం విషయంలో మాత్రమే కాదు ఇసుక తవ్వకాలలో కూడా జగన్ బినామీలు సుమారు 40 వేల కోట్ల వరకు దోచుకున్నారని పవన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాజధానిగా మారిపోయింది అంటూ జగన్ పరిపాలనపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు కురిపిస్తూ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అంటూ ఈ సందర్భంగా పవన్ తమ గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు.





























