Jagan Movie: జగన్ అంటేనే టక్కున అందరికీ ఏపీ ముఖ్యమంత్రి గుర్తుకు వస్తారు. అయితే జగన్ పేరు మీదగా ఓ సినిమా కూడా ఉందండోయ్.. ఈ సినిమా గురించి చాలా మందికి తెలియదు. అప్పట్లో శోభన్ బాబు హీరోగా ద్విపాత్రాభినయంలో తెరకెక్కిన సినిమా ప్రేక్షకులను సందడి చేసింది. మరి ఆ సినిమా విశేషాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను సందడి చేశాయి. ఈ క్రమంలోనే 1972లో వచ్చిన మానవుడు దానవుడు అనే సినిమాలో శోభన్ బాబు హీరోగా నటించారు. ఇందులో శోభన్ బాబు జగన్ అనే పాత్రలో నటించారు. ఇక ఈ పాత్ర అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో చాలామంది తమ పిల్లలకు జగన్ అనే పేరు కూడా పెట్టారు.
ఇక జగన్ పాత్రకు వచ్చిన ప్రేక్షకాదరణ దృష్టిలో ఉంచుకొని దాసరి నారాయణరావు రాజకీయాల నేపథ్యంలో ఓ సినిమాని ప్లాన్ చేశారు. ప్రస్తుతం, మాజీ ముఖ్యమంత్రుల మధ్య డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి జగన్ అని పేరు పెట్టారు. ఈ సినిమాలో శోభన్ బాబు ద్విపాత్రాభినయంలో నటించారు.
ఇక ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న తర్వాత సెన్సార్ వెళ్ళినప్పుడు సినిమాకు అభ్యంతరం వచ్చింది. ఇందులో ముఖ్యమంత్రిని ఉద్దేశించి పలు సన్నివేశాలు ఉండటం చేత సెన్సార్ సభ్యుల నుంచి అభ్యంతరాలు వెలువడ్డాయి. అయితే దాసరి సినిమాలకు ఇలాంటి అభ్యంతరాలు రావడం సర్వసాధారణం ఈ క్రమంలోనే దాసరి రివిజన్ కోసం ప్రింట్ ముంబైకు వెళ్ళింది. అక్కడ పలు సమస్యలు ఎదురైనా, అనంతరం ఈ సినిమా అనుకున్న తేదీ కన్నా మరికొద్ది రోజులు విడుదలకు వాయిదా పడింది. అలా ఈ సినిమా 1984 మార్చి 10 వ తేదీ విడుదల అయింది. ఇలా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సాధించలేకపోయినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా విడుదల సమయంలో శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమా విడుదల కావడంతో ఈ సినిమా ప్రభావం శోభన్ బాబు జగన్ సినిమాపై పడింది.
తిరుమలలో భక్తులకు ముఖ్య సమాచారం వెలువడింది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే అర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తిరుమల…
తలస్నానం తర్వాత జుట్టును తుడిచేందుకు టవల్‌తో బిగిగా చుట్టుకోవడం చాలా మందికి సాధారణ అలవాటు. ఇది జుట్టు త్వరగా ఆరిపోతుందనే…
చర్మ సంరక్షణలో సహజమైన మార్గాలను అనుసరించాలనే ఆసక్తి ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతో చర్మాన్ని కాపాడుకోవచ్చని…
హిందూ పంచాంగంలో వైశాఖ మాసానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. చైత్రం తర్వాత వచ్చే ఈ నెలను శుభకార్యాలకు, పూజా…
శుక్రవారం అమావాస్య రోజు హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగినదిగా భావిస్తారు. ఈ రోజున మహాలక్ష్మీ దేవిని ఆరాధించడం…
మన రోజువారీ జీవితంలో నిద్రకు ఉపయోగించే దిండు (Pillow) గురించి చాలా మంది పెద్దగా ఆలోచించరు. మంచిగా కనిపిస్తే, మృదువుగా…