Jagapathi Babu: ఎన్టీఆర్‌పై జగపతిబాబు స్టన్నింగ్ కామెంట్స్..! మీతో ఇక చేయను అని..!
Jagapathi Babu: విలక్షణ నటుడు జగపతి బాబు.. హీరోగా తన ప్రయాణం మొదలుపెట్టి ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరపై తన ముద్రను వేశారు. ఫ్యామిలీ హీరోగా మొదటగా కనిపించిన జగపతిబాబు.. తెలుగు మహిళ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.
హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత విలన్ గా తన మార్క్ చూపించాడు. లెజెండ్, అరవింద సమేత వీరరాఘవ సినిమాల్లో తన విలనిజంతో హీరోలకు సమానంగా ఫెర్ఫామెన్స్ చేశాడు. తండ్రి ప్రముఖ నిర్మాత విబీ రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా వెండితెరకు పరిచయమైన జగపతి బాబు… సొంత టాలెంట్ తో సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు.
తొలిసినిమా స్వప్నలోకం సినిమాతోనే మంచి పేరు సాధించారు. అక్కడితో ఆగకుండా ఇతర ప్రొడక్షన్లలో కూడా వరసగా సినిమాలు చేస్తూ..ముఖ్యంగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్య్వూలో కీలక కామెంట్స్ చేశారు జగపతి బాబు.
త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమాలో ‘బసిరెడ్డి’ క్యారెక్టర్ గురించి.. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. ఎన్నో సినిమాలు చేస్తే తప్పా బసిరెడ్డి వంటి క్యారెక్టర్ రాదని.. ఆ క్యారెక్టర్ అంతగా కుదిరిందని జగపతి బాబు అన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో నాది అగ్రెసివ్ క్యారెక్టర్ అని.. తారక్ ది కూల్ క్యారెక్టర్ అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే తారక్ క్యారెక్టర్ కన్నా బసిరెడ్డి క్యారెక్టర్ చాలా ఎలివేట్ అయిందని.. అంత పెద్ద హీరో ఈ క్యారెక్టర్ కు ఓప్పుకోవడం చిన్న విషయం కాదన్నారు జగపతి బాబు. ఓ సందర్భంలో తారక్ బాబు మీకు.. నాకు అయిపోయింది. మీతో ఇక చేయలేను. మీరు తారక్‌తోనే ఆడుకుంటున్నారు కుదరదు. ఇక నాలుగైదేళ్లు మీ ముఖం చూపించకండి’అని తారక్ అన్నారు. దానికి నేను ఓకే తారక్ అన్నాను. అయిపోయింది’అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…