Dosa King Movie: సూర్య హీరోగా తమిళ దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జై భీమ్. ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా ఓ దళిత మహిళ తనకు జరిగిన అన్యాయంపై ఎలా పోరాటం చేసింది తనకు లాయర్ చంద్రు ఏ విధంగా సహాయం చేశారు అనే నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకువచ్చారు.
ఇక ఈ సినిమా ఎలాంటి మంచి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ బరిలో కూడా నిలబడింది. ఇలా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా పలు వివాదాలలో కూడా చిక్కుకుంది.ఇకపోతే నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకులను సందడి చేసిన డైరెక్టర్ జ్ఞానవేల్ మరొక నిజజీవిత కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
ఇక ఈ సినిమాని దర్శకుడు తమిళ తెలుగు భాషలలో కాకుండా హిందీలో దోశ కింగ్ అనే సినిమా చేయబోతున్నారు. శరవణ భవన్’ పి.రాజగోపాల్ ‘దోసె కింగ్’ గా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించారు హోటల్లు దేశ విదేశాలలో కూడా మంచి ఆదరణ సంపాదించుకున్నాయి.అయితే ఈయనకు జోస్యం పిచ్చి కారణంగా ఓ జ్యోతిష్యుడు చెప్పిన విధంగా తన దగ్గర మేనేజర్ గా పని చేసే వ్యక్తి కుమార్తె జీవజ్యోతి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తన వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు.
ఈ క్రమంలోనే అప్పటికే రెండు పెళ్లిళ్లు అయిన రాజగోపాల్ తనని మూడో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేశారు. అయితే అందుకు ఆమె నిరాకరించడంతో తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కూడా దారుణంగా సినిమా స్టైల్ లో చంపించారు. దీంతో జీవ జ్యోతి తనపై న్యాయం కోసం 18 సంవత్సరాలు పోరాటం చేసి చివరికి గెలిచింది. అయితే ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ కష్టాలను ఆమె ఏ విధంగా ఎదుర్కొని ఈ కేసు గెలిచిందనే కథాంశంతో జ్ఞానవేల్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…