Tollywood : సినిమా నిర్మాణంలో ఎక్కువ వ్యయం ప్రస్తుతం హీరో పారితోషకం, ఆ తరువాత డైరెక్టర్ల పారితోషకం, ఇక ఇతర నటుల రెమ్యూనరేషన్ ఉంటోంది. దీంతో సినిమా నిర్మాణ వ్యయం హద్దుదాటి పోతోంది. దీనివల్ల సినిమా ప్లాప్ అయితే నిర్మాత నష్టాలు చూస్తున్నాడు. కరోనా తరువాత పరిస్థితి మరింత దిగజారింది ఒకవైపు ప్రొడక్షన్ కాస్ట్ సినిమా తీయడానికి పెరుగుతుంటే మరోవైపు టికెట్ రేట్లు, ఓటీటీ ల ప్రభావం వల్ల నష్టాలు చూడాల్సి వస్తోంది.
పారితోషకం తగ్గించుకున్న అగ్ర హీరోలు…
నిర్మాతల సమస్యలను పరిష్కరించుకోడానికి చర్చలను జరిపింది నిర్మాతల మండలి. దీంట్లో అంతర్గత విషయాలను, కార్మికుల సమస్యలు, హీరోల రెమ్యూనరేషన్, టికెట్ ధరలు, ఓటీటీ లో సినిమాల విడుదల గురించి చర్చించారు. ఇక దిల్ రాజు హీరో రామ్ చరణ్ తో మాట్లాడి హీరోలతో చర్చించి రెమ్యూనరేషన్ తగ్గించుకునే విధంగా ఆలోచించాలని అడిగారు. ఇక ఈ విషయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వాళ్ళు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తగ్గించుకోడానికి ఒప్పుకున్నారు. ఇక నిర్మాతలు ఓటీటీ విషయంలో కూడా నిర్ణయం తీసుకున్నారు.
పెద్ద సినిమాలైతే విడుదలయిన పది వారాలకు ఓటీటీ లో రావాలని, చిన్న సినిమా అయితే నాలుగు వారాలకు ఓటీటీలో వచ్చేలా నిబంధనలు పెట్టాలని నిర్ణయించారు. ఫెడరేషన్ సమస్యల గురించి కూడా నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. ఇక కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్చలు జరిగాయి. ఇవే కాకుండా, హీరోల విషయమే కాకుండా ఇతర ఆర్టిస్టులు ఎక్కువ పారితోషకం తీసుకునే వారు తగ్గించుకోవాలని నిర్మాతల గిల్డ్ వినతి చేసింది. ఇక ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చారణ్ బాటలో మిగిలిన అగ్రహీరోలు కూడా వారి పారితోషకం తగ్గించుకునెందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…