Monitha: తెలుగు బుల్లితెరపై విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకొని అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ లో దీప కార్తీక్ పాత్రలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాని దీప కోసమే చూసేవారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ సీరియల్ లో మోనిత పాత్రకు కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు.
ఈ విధంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ కార్యక్రమంలో దీప, కార్తీక్ అలాగే మోనిత పాత్రలను ఈ సీరియల్ నుంచి తొలగించారు. ఇందులో దీప కార్తీక్ లను చనిపోయినట్టు చూపించగా మోనిత మాత్రం కార్తీక్ చనిపోయారన్న బాధలో తన కొడుకును సైతం వదిలి వెళ్ళిపోయినట్టు చూపించారు. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ లో హిమ సౌర్య పెద్దగా అవ్వడం వారి ప్రేమ కథతో నడుస్తుంది.
ఈ విధంగా ఈ సీరియల్లో కొత్త పాత్రలు వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. అయితే ఏదో ఒక రూపంలో తిరిగి కార్తీక్, దీప,మోనిత పాత్రలను తీసుకువస్తే బాగుండేదని పెద్ద ఎత్తున అభిమానులు ఆశపడుతున్నారు. అయితే ఇందులో విలన్ పాత్రలో నటించిన మోనిత తిరిగి ఈ కార్యక్రమానికి రీఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వినపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని పరోక్షంగా మోనిత క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తాను కార్తీకదీపం సీరియల్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నానని పోస్ట్ చేశారు.ఈ వీడియోలో భాగంగా ఈమె మాట్లాడుతూ చాలామంది అభిమానులు నన్ను కార్తీక దీపంలోకి రీ ఎంట్రీ ఇవ్వమని అడుగుతున్నారు. రావాలా? వద్దా? అనే కన్ఫ్యూషన్ లో ఉన్నాను. నాకైతే ఈ సీరియల్ లోకి రావాలని ఉంది.అయితే ఈ విషయం గురించి త్వరలోనే క్లారిటీ ఇస్తా అంటూ ఈ సందర్భంగా ఈమె కార్తీకదీపం రీ ఎంట్రీ గురించి మాట్లాడారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…