Jamuna : ఆత్మాభిమానం, అహంకారానికి మధ్య ఓ వెంట్రుక వాసంత తేడా ఉంటుంది. ఆనాడు ఈ రెండిటి మధ్య బాగా నలిగిపోయిన హీరోయిన్లు ఎవరంటే భానుమతి, ఆ తర్వాత వచ్చిన జమున. ఈ ఇద్దరు కూడా అప్పటి పెద్ద హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ ల విషయాల్లో కొంత భేదాభిప్రాయాలు కలిగి ఉండేవారు. సినిమాలో హీరో కంటే మేమేం తక్కువ అన్నట్టుగా ఇద్దరి ప్రవర్తన ఉండేది. ఆ క్రమంలో భానుమతి, జమునల ఆత్మాభిమానమో మరొకటో కావచ్చు. కానీ మొత్తానికి కొన్ని సినిమాలు పెద్ద బ్యానర్, పెద్ద హీరోలతో చిత్రాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో జమున ప్రవర్తన కారణంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఆమెను తమ సినిమాలకు దూరం పెట్టారని వదంతులు కూడా వచ్చాయి.
అప్పుడు జమున చాకచక్యంగా 1964 ఆ ప్రాంతంలో వచ్చిన యువ హీరో తనకంటే వయసులో దాదాపు ఆరు సంవత్సరాలు చిన్నవాడైన కృష్ణతో ఆమె నటించడానికి ముందుకు వచ్చారు. అప్పటికే జమున ఒక పెద్ద హీరోయిన్. ఆమె సాంఘికంలో గౌరీగా, జానపదాల్లో రాణిగా, పౌరాణికాల్లో దేవిగా రాణించారు. కృష్ణ అప్పుడప్పుడే తెలుగు సినీ పరిశ్రమలో ఎదుగుతున్న యంగ్ హీరో. అయినా కూడా జమున ఆలోచించకుండా హీరో కృష్ణతో నటించడానికి ఆమె ఒప్పుకున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఒప్పుకోవాల్సి వచ్చింది. అలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా అమాయకుడు.
1968 హిందీ చిత్రం అనారి.ఆధారంగా అడ్డాల నారాయణరావు దర్శకత్వంలో “అమాయకుడు” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో కృష్ణ,జమున హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో కె.విశ్వనాథ్ దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటూ.. 1968లో “ఉండమ్మా బొట్టుపెడతా” చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో కృష్ణ, జమున హీరో, హీరోయిన్లుగా నటించారు. 1969 ఎంవిఆర్ ప్రొడక్షన్స్. మల్లికార్జున్ రావు దర్శకత్వంలో ‘ముహూర్త బలం’ చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో కృష్ణ, జమున హీరో హీరోయిన్లుగా నటించారు. 1972 రవిశంకర్ పిక్చర్స్, బిఎస్. నారాయణ దర్శకత్వంలో “మేనకోడలు” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో కృష్ణ జమున హీరో హీరోయిన్లుగా నటించారు.
1973 సురేష్ ప్రొడక్షన్స్, చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘స్నేహబంధం’ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో కృష్ణ, జమున హీరో హీరోయిన్లుగా నటించారు. 1973పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తిరిగి రెండోసారి కృష్ణ తో “మమత” చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో కృష్ణ, జమున హీరో హీరోయిన్లుగా నటించగా.. కృష్ణంరాజు, చంద్రమోహన్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు. 1973 గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ హేమంబరదరావు దర్శకత్వంలో “దీర్ఘసుమంగళి” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో కృష్ణ జమున హీరో,హీరోయిన్లుగా నటించారు. చక్కటి కుటుంబ కథ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం అద్భుత విజయాన్ని అందుకుంది. 1974 డి.ఎల్ నారాయణ నిర్మాణం లో, పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో “పెద్దలు మారాలి” చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో కూడా కృష్ణ,జమున జోడి కట్టారు..
1974 చిత్రాంజలి ప్రొడక్షన్స్,భాస్కరరావు దర్శకత్వంలో “మనుషులు మట్టి బొమ్మలు” చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో కూడా కృష్ణ, జమునలు జంటగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1974 శ్రీవాణి ఆర్ట్ కంబైన్డ్స్,పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో “గౌరి” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో కృష్ణ,జమున హీరో, హీరోయిన్లుగా పదవసారి కలిసి నటించారు. కృష్ణ తన సినీ జీవితంలో తనకంటే వయసులో చిన్న వారైనా దాదాపు 80 పైగా హీరోయిన్స్ తో నటించగా.. తనకంటే వయసులో పెద్దవారైనా ఒకే ఒక హీరోయిన్ జమునతో పదికి పైగా చిత్రాల్లో నటించడం విశేషం. గూడచారి116, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు, దేవుడు చేసిన మనుషులు, సింహాసనం లాంటి చిత్రాలతో అద్భుత విజయాలను అందుకుని హీరోయిన్ జమున చూస్తుండగానే హీరో కృష్ణ సినీ ఉన్నత శిఖరాలను అధిరోహించడం గమనార్హం.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…