Singer yasaswi: సరిగమప సింగింగ్ కాంపిటీషన్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు సింగర్ యశస్వి. అద్భుతమైన గాత్రంతో పాటలు పాడుతూ ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి ఈయన ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే ఈయనలో మంచి గాయకుడు మాత్రమే కాకుండా మంచి మనసు కూడా ఉందని నిరూపించుకున్నారు. ఈయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో కొంతమంది అనాధ పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు.
ఇలా పేద అనాధ పిల్లలను తాను ఆదరించి హక్కును చేర్చుకున్నానని ఒక ఎన్జీవో సమస్థ ద్వారా వీరి బాగోగులు తానే చూసుకుంటున్నానని పెద్ద ఎత్తున కలరింగ్ ఇచ్చారు.ఇలా తాను మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పి ఎంతోమంది సింపతి ఓట్లు కూడా దక్కించుకున్నారు.
ఇలా యశస్వి కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్ పేరుతో ఓ ఎన్జీవో సంస్థ నడుస్తోంది.ఇక్కడ సుమారు 60 మంది పిల్లల వరకు ఆశ్రయం పొందుతున్నారు. ఇక వీరి బాగోగులు వీరి చదువులను సదురు నవసేన ఎన్జీవో సమస్థ బాధ్యతలు చూసుకుంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతో ఫోటోలు దిగిన యశస్వి తానే ఆయన నడుపుతున్నానంటూ కలరింగ్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే నవసేన ఫౌండేషన్ ఎన్జీవో సమస్థ ఓనర్ ఫరా కౌసర్ ఈ విషయంపై స్పందిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా నవసేన ఫౌండేషన్ కి ఎవరూ కూడా సెలబ్రిటీలు విరాళం ఇవ్వలేదని, తానే తన డబ్బుతో పిల్లల అవసరాలు తీరుస్తూ ఈ ఎన్జీవో సమస్థ నడుపుతున్నానని తెలిపారు. తనది కానీ ఎన్జీవో సమస్తను తానే నడుపుతున్నట్లు చెప్పుకుంటున్నటువంటి సింగర్ యశస్వి పై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలంటూ నవసేన నిర్వాహకురాలు పరాక్ కౌసర్ అసలు విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…