Featured

Janardhan Rao : బ్రహ్మానందం తో క్లాష్ వచ్చి ఏవిఎస్ 20 మంది కమెడియన్లతో మీటింగ్ పెట్టాడు… చివరికి చిరంజీవి గారి దగ్గరికి గొడవ వెళ్ళింది..: జనార్దన్ రావు

Janardhan Rao : తెలుగు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన పొలాప్రగఢ జనార్దన్ రావు గారు తన సినిమా విశేషాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జెన్నీ గా బాగా ప్రాచుర్యం పొందిన ఈయన సినిమాలే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించారు. ఈసిఐఎల్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు లో కుడా పని చేసారు. ఒక 3 నెలల పాటు యాక్టింగ్ కోర్స్ కుడా చేసిన ఈయన ఆ అనుభవంతో ఎన్నో చిత్రాలలో, సీరియల్స్ లో మరియు ఎన్నో వేల స్వదేశీ, విదేశీ సినిమా కార్యక్రమాలలో పాల్గన్నారు.

బ్రహ్మానందం తో గొడవ… 20 మంది కమెడియన్స్ తో మీటింగ్…

చాలా ఏళ్ల క్రితం సినిమాల్లో అందరు కమెడియన్స్ కి మంచి అవకాశాలతో ఈవివి, జంధ్యాల గారి సినిమాల వల్ల ఎంతో మంది కమెడియన్స్ వచ్చారు. అలా జెన్నీ గారు చాలా మంది కమెడియన్స్ బ్రహ్మానందం, సుత్తివేలు, కోటా శ్రీనివాస్రావు, బాబు మోహన్, గుండు హనుమంతరావు, ఏవిఎస్ వంటి వారితో కలిసి చాలా సినిమాల్లో చేసారు. ఇక అలాంటి సమయంలోనే బ్రహ్మానందం తో క్లాష్ వచ్చిన వారందరు కలిసి 20 మంది కమెడియన్స్ ఏవిఎస్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ కి నేను వెళ్ళలేదు.

ఆ తరువాత ఒకసారి ఒక సినిమా షూటింగ్ లో బ్రహ్మానందం కనిపించి మీటింగ్ కి నువ్వెందుకు వెళ్ళలేదు అని అడిగారు. నిజానికి చెప్పాలంటే నన్ను అసలు ఎవరూ పిలవలేదు. ఒకవేళ పిలుచుంటే వెళ్ళేవాడినేమో తెలియదు. ఆ మీటింగ్ కి మీతో గొడవ జరిగిన వాళ్ళు వెళ్లారు నాకు మీతో గొడవ ఏం లేదు కాబట్టి నన్ను పిలవలేదేమో అని నిర్మొహమాటంగా చెప్పడంతో బ్రహ్మానందం అదీ నిజమేలే అని అన్నారు అంటూ అప్పటి సంఘటన గురించి జెన్నీ తెలిపారు. ఇక ఆ గొడవ చిరంజీవి వద్దకు వెళ్ళింది ఆయన సర్దుబాటు చేసి మీడియా వరకు వెళ్ళకండి అని నచ్చజెప్పడంతో సద్దుమణిగింది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

8 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

8 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

8 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

8 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

8 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

8 hours ago