Categories: FeaturedMovie News

Jandhyala wife Annapurna : జంధ్యాల గారు మరణించడానికి అసలు కారణం ఇదే… ఇల్లు ఖాళీ చేయించడంలో బాలు గారు సహాయం చేసారు… జంధ్యాల గారి భార్య అన్నపూర్ణ

Jandhyala wife Annapurna : తెలుగు సినిమాకు కామెడీ అనగానే గుర్తొచ్చే పేరు జంధ్యాల. నవ్వించడం ఒక యోగం నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం అంటూ ఆయన రాసిన డైలాగు ఇప్పటికీ ఫేమస్. ఇక ఆయన సినిమాల ద్వారా తెలుగులో ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అంతేకాకుండా తెలుగులో ఆరోగ్యకరమైన హాస్యానికి జంధ్యాల గారు పేరు. అందుకే ఆయనను హాస్య బ్రహ్మ అని అంటారు. ‘ముద్దమందారం’ సినిమాతో డైరెక్టర్ అయిన జంధ్యాల గారు సుమారు 50 సినిమాలకు డైరెక్షన్ చేసారు. 300 సినిమాలకు పైగా రచయితగా డైలాగులు రాసారు. ఇక ఆయన మరణించిన తరవాత ఆయన కుటుంబం ఎక్కడా కనబడలేదు. మొదటి సారి ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన భార్య అన్నపూర్ణ గారు ఆయన గురించి ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.

జంధ్యాల గారు ఎలా మరణించారంటే…

జంధ్యాల గారికి అప్పటికే మధుమేహవ్యాధి ఉండటంతో షుగర్ టెస్టు కోసం ఎప్పటిలాగే హాస్పిటల్ వెళ్లగా మళ్ళీ అసిస్టెంట్ వచ్చి అల్పాహారం తీసుకువెళ్ళాడు. అయితే డాక్టర్ రాలేదని రిపోర్ట్స్ వచ్చాక మాట్లాడి వస్తానని చెప్పిన ఆయన ఇక రాలేదని, మధ్యాహ్నం సమయంలో ఆయనకు సీరియస్ గా ఉందని ఫోన్ రావడంతో హాస్పిటల్ కి వెళ్లగా అయనకు గుండె నొప్పి వచ్చిందని చెప్పారు. అలా ఆయన దూరమయ్యారని అన్నపూర్ణ గారు తెలిపారు. ఇక జంధ్యాల గారి తల్లి గురించి చెబుతూ ఆమె ఒక ఐదేళ్ళ క్రితం మరణించారని 90 ఏళ్ళు దాటాక మరణించారని తెలిపారు. భర్త మరణించాక అత్తగారే ధైర్యం చెప్పి అండగా నిలబడ్డారని చెప్పారు అన్నపూర్ణ.

బాలు గారు ఇల్లు ఖాళీ చేయించి సహాయం చేసారు…

జంధ్యాల గారు మరణించాక కూడా ఇండస్ట్రీ నుండి కొంతమంది అలాగే అభిమానులు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడుగుతుంటారుంటూ చెప్పారు. ఇక బాలు గారు ఎపుడూ టచ్ లోనే ఉన్నారని ఆయన చివర్లో హాస్పిటల్ కి వెళ్లే నాలుగు రోజుల ముందు ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేయించాలి అని అడిగితే వెంటనే మనిషిని పంపి నేను ఖాళీ చేయిస్తాను, స్టూడియోలో ఉంటే ఫోన్ మాట్లాడలేను మెసెజ్ చేయండి అని మాట్లాడారట. చెన్నై లో బాలు గారి ఇంటికి దగ్గర్లోనే జంధ్యాల గారి ఇల్లు ఉందట. ఇక ఆ తరువాత ఆయనకు కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరడం, ఆయన మరణించడం జరిగింది అంటూ చివరి చూపుకు కూడా వెళ్లలేని పరిస్థితి అంటూ ఆయన గురించి తెలిపారు అన్నపూర్ణ గారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago