Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది. తన అందం, అభినయంతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన జాన్వి కపూర్ ప్రస్తుతం సౌత్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా ద్వారా టాలివుడ్ లో అడుగు పెట్టబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి జాన్వి కపూర్ ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఇలా సౌత్ లో కూడా హీరోయిన్ గా రాణించడానికి ప్రయత్నాలు చేస్తున్న జాన్వీ కపూర్ తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఈ క్రమంలో తనని పెళ్ళి చేసుకోబోయే వాడికి కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ పెట్టిన కండిషన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తనని పెళ్ళి చేసుకోబోయే వాడు తన వృత్తిని గౌరవించాలని, ఎక్కువ సమయం తనతోనే గడపాలని కండిషన్ పెట్టింది. అంతే కాకుండా కొత్త విషయాలు నేర్చుకొని తనకు తెలియచెప్పాలని, అలాగే తనని పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలని తన కోరిక బయటపెట్టింది. అంతేకాకుండా ఎప్పుడు తనతో ఉంటూ తనని కేరింగ్ గా చూసుకునేవాడు భర్తగా రావాలని కోరిక బయట పెట్టింది.
అలాగే మరొక ముఖ్యమైన కండిషన్ ఏమిటంటే తనని పెళ్లి చేసుకోబోయే వాడు తన తండ్రి కన్నా ఎక్కువ హైట్ ఉండాలని కండిషన్ పెట్టింది. ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్ బిజినెస్ మెన్ శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరి ప్రేమ విషయం అఫీషియల్ గా వెల్లడించకపోయినా కూడా .. అతనితో కలిసి టూర్లు.. షికార్లు అంటూ తెగ తిరుగుతోంది. జాన్వీ కపూర్ చెప్పిన క్వాలిటీస్ అన్ని అతనిలో ఉన్నాయా? లేక అతను డేటింగ్ వరకేనా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…