Singer Sunitha: టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా గుర్తింపు పొందిన సునీత గురించి తెలియని వారంటూ ఉండరు. తన మధురమైన గానంతో పాటలు పాడి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న సునీత ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉండగా సునీత భర్త వీరపనేని రామకృష్ణకు ఇటీవల ఫోన్ ద్వారా బెదిరింపులు ఎదురయ్యాయని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం.
రామకృష్ణ తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో సింగర్ గా గుర్తింపు పొందిన సునీత మొదటి భర్తకు విడాకులు ఇచ్చి చాలా కాలం పిల్లలతో కలిసి జీవించింది. అయితే ఇటీవల పిల్లల సహకారంతో రామ్ వీరపనేనిని రెండవ వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించింది. అయితే సునీత ఇలా ఈ వయసులో రెండవ వివాహం చేసుకోవడంతో ఇప్పటికీ ఆమె గురించి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.
మొదట్లో ఈ విమర్శల గురించి స్పందిస్తూ ఎమోషనల్ సునీత ఇప్పుడు లోకం తీరు తెలిసి ఇలాంటి విమర్శలను పట్టించుకోకుండా భర్త పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తోంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా వీరపనేని రామకృష్ణ కి గుర్తు తెలియని వ్యక్తి తరచూ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. లక్ష్మణ్ అనే వ్యక్తి ఫోన్ చేసి తాను నిర్మాతల మండలి సభ్యుడినని, ముఖ్యమైన విషయాలు చర్చించాలని తరచూ ఫోన్ చేసి విసగిస్తున్నారట.
లక్ష్మణ్ ఎవరో తనకు తెలియకపోవటంతో రామకృష్ణ అతని ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు. దీంతో లక్ష్మణ్ అనే వ్యక్తి ఇతర నెంబర్ నుండి ఫోన్ చేసి అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడటంతో రామకృష్ణ బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించి తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు 506 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…