Featured

Jaya Prakash Narayana : ప్రస్తుతం పవన్ సంఘర్షణ అదే… ఆటగాళ్లు కాదు ఆట నియమాలు మారాలి… ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన జేపీ..!

Jaya Prakash Narayana : లోకసత్తా ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేసిన జయప్రకాశ్ గారు సమాజ సేవ చేయడం కోసం తన ఐఏఎస్ కు రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలోకి వచ్చారు. ఇక ఆ తరువాత లోకసత్తా రాజకీయ పార్టీని స్థాపించి 2014 ఎన్నికలలో పోటీచేసారు. ఇక ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిణామాలు, జనసేన పార్టీ భవితవ్యం పొత్తుల గురించి ఆయన విశ్లేషించారు.

పవన్ ఇపుడు ఆ సంఘర్షణలో ఉన్నాడు…

ఇక జనసేన అధినేత 2024 ఎలక్షన్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే పొత్తుల గురించి రాష్ట్రంలో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఒక వైపు టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే మేలు జరుగుతుందని కింది స్థాయి కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే పవన్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఈ విషయంలో ఇక చర్చలు జరపలేదు. అయితే జనసేన అధినేత గతంలో విడి విడిగా పోటీ చేయడం వల్ల అధికార పార్టీ లాభపడుతుందంటూ కామెంట్స్ చేసారు. ఇక ఇపుడు ప్రజల తోనే నా పొత్తు నిర్ణయం అంటూ మాట్లాడారు. దీనిపై జేపీ గారు విశ్లేషించారు. రెండు ప్రధాన పార్టీలు ఉన్నప్పుడు మన ఇండియాలో మూడో పార్టీని ప్రజలు పట్టించుకోరని గెలచదేమో అని భావించినా పార్టీకి నచ్చినా ఓట్లు వేయరు.

అంతగా నచ్చకపోయినా, రెండు పార్టీలలోను లోపాలున్నా ఏది కొంచెం బెటర్ అని పోల్చి చూసి ఓటు వేస్తారని చెప్పారు. ఇప్పుడు జనసేన పరిస్థితి కూడా అదేనని వాఖ్యణించారు. రెండు ప్రధాన పార్టీల నడుమ అస్తిత్వం కోసం పోరాడాలి ఇక గెలవాలంటే మాత్రం ఏదో ఒక ప్రధాన పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో పార్టీ సిద్ధాంతలకు కొంత వ్యతిరేకం అయినా ఏదో ఒక పార్టీ తో పొత్తు పెట్టుకోవడమా లేకపోతే ఒంటరిగా పోటీ చేసి మన సిద్ధాంతాలు మైల పడకుండా చూసుకోవడమా అన్న మీమాంస ఉంటుంది. అలాంటి పరిస్థితి లోనే ఇపుడు పవన్ ఉన్నారు. ఇది కొంత కష్టతరమైన విషయమే అయినా నిర్ణయం ఆయనదే. అయితే ఒక ఇరవై, ఇరవైఐదు సంవత్సరాలు అలా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పోరాడగలిగితే, మనుగడ సాధించగలిగితే కచ్చితంగా ప్రజల ఆదరణ లభిస్తుంది. అయితే ఇండియాలో అభివృద్ధి జరగాలంటే మారాల్సింది నాయకులు కాదు వ్యవస్థ. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ సమయంలో ఆ తరువాత ఎన్నికల్లో ఓడిపోయినపుడు కొత్త ప్రభుత్వం ఏదో చేస్తుందని నమ్మిన వ్యక్తుల్లో నేను ఒకడిని కానీ అవినీతి, నిరుద్యోగం వంటి సమస్యలు పోలేదు కాబట్టి మారాల్సింది ఆటగాళ్లు కాదు ఆట నియమాలు అని జేపీ గారు చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago