Madhavan : చెలి, సఖి సినిమాలతో అమ్మాయిల మనసు దోచుకున్న తమిళ హీరో మాధవన్ ప్రస్తుతం సినిమాలను చాలా సెలక్టివ్ గా చేస్తున్నారు. తాజాగా ఆయన మెగాఫోన్ పట్టుకుని దర్శకుడిగా మారి సినిమా తీస్తున్నారు. నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తీస్తున్న ఈ చిత్రంలో నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ నటించారు. ఇక ఈసినిమా జులై 1న విడుదల అవ్వబోతోంది. కరోనా పాండమిక్ తరువాత ఈసినిమా అనేక వాయిదాల నడుమ జులై 1న రాబోతోంది.
ఆయనలాగా కనిపించడం కోసం నా దవడ విరగ్గొట్టుకోవాల్సి వచ్చింది…
నంబి నారాయణన్ ఇస్రో శాస్త్రవేత్త, కానీ ఆయన గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కేవలం ఆయన గూఢచర్యం చేసాడనే నిందలు మాత్రమే తెలుసు. అందుకే ఆయన కథను ప్రపంచానికి చెప్పాలని నిర్ణయించుకున్నాను. అయితే మొదట అనుకున్న దర్శకుడు సరిగా తీయడం లేదని దర్శకత్వ బాధ్యత తీసుకున్నాను. ఇక సినిమా నిర్మించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ బాధ్యతా నేనే తీసుకున్నా అని మాధవన్ చెప్పారు. ఇక ఈ సినిమాకు కథ, మాటలు, నిర్మాత, దర్శకత్వం అన్నీ మాధవన్ చేస్తున్నారు. ఇక ఈసినిమాలో సూర్య, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సినిమాలో రాకెట్ సైన్స్ ని సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాను అయితే తన నెక్స్ట్ సినిమాలకోసం ఇక దర్శకత్వం చేయను, ఈ సినిమాలో చాలా టెన్షన్ పడ్డాను అంటూ మొదటి సారి డైరెక్షన్ అనుభవాన్ని చెప్పారు మాధవన్. ఇక సినిమాలో నంబి నారాయణన్ లా కనిపించడం కోసం చాలా కష్టపడ్డానని దవడ కుడా విరగ్గొట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు. నంబి నారాయణన్ ఒక మాల్దీవులుకు చెందిన యువతి ప్రేమలో ఎలా పడ్డాడు, గూడచర్యం నింద ఎలా మోపబండింది, ఆయన ఇస్రో కి అందించిన సేవల గురించి రాకెట్రి : ది నంబి ఎఫెక్ట్ సినిమాలో చూపబోతున్నాడు మాధవన్.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…