Featured

Jayamaalini : పవన్ కళ్యాణ్ కి సిగ్గు ఎక్కువ నన్ను చూసి ఏమన్నారంటే… నేను అలాంటి దానిని కాదు అని చెప్పా… హగ్ ఇచ్చారు…: జయమాలిని

Jayamaalini : ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ హీరోయిన్స్ చేస్తున్నారు. కొత్తగా ఎవరో ఒకరు ముంబై నుండి వచ్చిన మోడల్ చేస్తున్నారు. అయితే ఒకప్పట్లో లాగా ఐటమ్ సాంగ్ అంటే మాత్రం జ్యోతిలక్ష్మి, జయమలిని, డిస్కో శాంతి, అనురాధ ఇలా కొంత మంది గుర్తొస్తారు. అందులోనూ జ్యోతిలక్ష్మి, జయమాలిని అంటే అప్పట్లో ఐటమ్ సాంగ్ కే క్రేజ్ తెచ్చారు. ముఖ్యంగా జయమాలిని ఐటమ్ సాంగ్ ఉంటేనే అన్నట్లుగా సినిమాలను తీసిన రోజులు ఉండేవి. హీరోయిన్లకు ధీటుగా రెమ్యూనరేషన్ తీసుకున్న జయమాలిని పెళ్లి తరువాత సినిమాలలో నటించడం మానేశారు. కేవలం కుటుంబానికి సమయం కేటాయిస్తూ హ్యాపీ గా ఉన్నారు. అయితే ఇటీవల జయమాలిని హైదరాబాద్ కి తనతో పనిచేసిన వారిని చూడాలని వచ్చి అందరినీ కలిశారు. అలా అనుకోకుండా పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఆయన కలిసినపుడు జరిగిన సంఘటనలను వివరించారు.

పవన్ కళ్యాణ్ కి సిగ్గు ఎక్కువ…

జయమాలిని గారు బాలకృష్ణ ను కలవడానికి ఆహా అన్ స్టాపబుల్ షో షూటింగ్ కి వెళ్లగా అక్కడ మామూలుగా బాలయ్య పలకరిస్తారని అనుకుంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడంటూ తెలిపారు జయమాలిని. బాలయ్య హగ్ చేసుకుని మాట్లాడి అక్కడున్న అందరికీ నా ఫస్ట్ హీరోయిన్ అంటూ పరిచయం చేశారట. అక్కడ అందరికి నా ఫస్ట్ హీరోయిన్ అని చెప్తా స్టేజి మీద చూస్తావా అని అడిగారట. ఇక అక్కడే పవన్ కళ్యాణ్ కూడా ఉండటంతో ఆయనను కలిసిన జయమాలిని ఆయన గురించి చెప్పారు.

పవన్ కళ్యాణ్ చాలా సిగ్గు పడతారు, తల వంచుకుని సైలెంట్ గా ఉన్నారు. ఆయన చేయి పట్టుకుని షోలో స్టేజి మీదకు వచ్చేటపుడు ఏమండి ఏమీ అనుకోవద్దు నేను మంచి అమ్మాయినే అనే సరికి ఆయన నవ్వారు. ఇక చివర్లో వెళ్ళేటపుడు మాట్లాడించారు బాగున్నారా అని, నేను మీరు బాగున్నారా అని అడిగి ఓ మీకు మాట్లాడటం వచ్చా అంటూ నవ్వాను అంటూ జయమాలిని పవన్ గురించి మాట్లాడారు. అన్ స్టోపబల్ ఎపిసోడ్ లో పవన్ తో పాటు జయమాలిని స్టేజి మీదకు వచ్చారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago