Featured

Senior Journalist Bhardwaja : బాలయ్య భజన చేస్తే నీ కెరీర్ ముగిసినట్టే…: సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bhardwaja : సినిమాల్లో సెలబ్రిటీలకు పొగడ్తలన్నా, ప్రశంసలన్నాన్న బాగా ఇంట్రస్ట్ ఉంటుంది. అవకాశాల కోసం అవసరం కోసం చిన్న ఆర్టిస్టులు పెద్ద డైరెక్టర్లను, హీరోలను పొగడటం మామూలే. అయితే సినిమా ఇండస్ట్రీలోనే కాదు బయట జరిగేదే. అయితే సినిమా ఇండస్ట్రీలో ఆడియో ఫంక్షన్స్ లోనూ ఇవేంట్స్ లోనూ సమయం దొరికినప్పుడల్లా భజన చేస్తూ బిస్కెట్ వేయడానికి కొంతమంది తెగ ట్రై చేస్తారు. ఒక అగ్ర హీరోతో పనిచేసే అవకాశం వస్తే ఒక కుర్ర డైరెక్టర్ నేను మీ అభిమానిని, మీ సినిమాలను చూస్తూ పెరిగాను ఇలాంటి మాటలు చెబుతుంటారు. అయితే కొంతంది ఇందులో నిజాయితీగా చెబుతుంటారు మరికొంతమంది మాత్రం ఏ హీరోతో చేస్తే అప్పుడు ఆ హీరో నా ఫేవరెట్ అన్నట్లు చెబుతుంటారు. అలాంటి వాళ్లందరినీ చూస్తూనే ఉంటాం. అయితే కొన్నిసార్లు అలా భజన చేయడం వల్ల కెరీర్ కి ప్లస్ అవ్వొచ్చు మరోసారి మైనస్ కూడా అవ్వొచ్చు. ఇప్పుడు సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ కూడా అలాంటి పరిస్థితిల్లోనే ఉన్నాడు అంటూ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ అభిప్రాయపడ్డారు.

బాలయ్య భజన ఆపకపోతే నీ కెరీర్ అంతే…

భరద్వాజ గారు థమన్ మ్యూజిక్ గురించి మాట్లాడుతూ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా థమన్ సంగీతం ఉందంటూ అయితే బాలయ్య బాబు అభిమాని అంటూ చెప్పి బాలయ్య సినిమాలకు మ్యూజిక్ చెస్తున్నావ్ మిగతా సినిమాలకు చెయకపోతే మిగతా హీరోలు తనను పట్టించుకోవడం మానేస్తారంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు. జై బాలయ్య అంటూ ఆయణ సినిమాలకు మాత్రమే పనిచేస్తే నిన్ను నియంత్రించుకోవడం అవుతుంది. ఎంతో ఉన్న కెరీర్ ను పాడుచేసుకున్నట్లే అంటూ తెలిపారు.

రీసెంట్ గా వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా కోసం తనవంతుగా బాగా కష్టపడ్డానని చెబుతున్న థమన్ బాలయ్య నెక్స్ట్ సినిమా కూడా నేనే మ్యూజిక్ డైరెక్టర్ అంటూ సినిమా ప్రకటించకముందే చెప్పేసాడు. ఇదంతా దుందుడుకు చర్య, దీనివల్ల నష్టపోయేది థమన్ మాత్రమే అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు. సంగీత దర్శకుల్లో దాదాపు కొన్నేళ్లు ఏకచత్రాధిపత్యం సాధించిన చక్రవర్తి వంటి వారిని చూస్తే ఆయన మొదట రామారావు గారికి మాత్రమే చేసేవాడు కానీ ఆ తరువాత మిగిలిన హీరోలందరూ ఆయనతోనే మ్యూజిక్ చేయించుకోవాలి అనేంతలా ఆయన చేసుకున్నారు. అలా థమన్ కూడా అభిమానం ఉంటే ఉన్నా మిగిలిన హీరోల సినిమాల మీద కూడా శ్రద్ధ పెట్టాలి అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago