Dasari Vignan : బాలకృష్ణ హోస్ట్ గా వస్తున్న అన్ స్టోపబుల్ షో ఆహా ఒరిజినల్స్ కే సూపర్ హిట్. షో వల్ల మొత్తం ఆహా ఖాతాలు కొన్నవాళ్లు ఉన్నారు. రేటింగ్స్ లో దుమ్ముదులిపిన ఈ షో సీజన్ 2 వచ్చేసింది. ఇక మొదటి ఎపిసోడ్ తోనే మళ్ళీ రికార్డులను తిరగశారు ఆహా వాళ్ళు. ఏకంగా చంద్రబాబు నాయుడు లోకేష్ లు ఈ షోకి వచ్చి కనువిందు చేసారు. ఇక సెకండ్ ఎపిసోడ్ లో యూత్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లతో సందడి చేసి బాలయ్య రచ్చ చేసాడు. ఇక నాలుగో ఎపిసోడ్ లో శర్వానంద్, అడవి శేష్ వచ్చి కనువిందు చేయగా, ప్రభాస్ గోపీచంద్ ఎపిసోడ్ అయితే అన్ స్టాపబుల్ కి రేటింగ్స్ లో దుమ్ములేచిపోయింది. ఇప్పుడు ఏకంగా పవర్ ప్యాక్ హై వోల్టెజ్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడని మొదటి గ్లింప్స్ కూడా ఆహా విడుదల చేసింది.
తలలు పట్టుకుంటున్న ఆహా యాజమాన్యం…
అనలిస్ట్ దాసరి విజ్ఞాన్ మాట్లాడుతూ అన్ స్టాపబుల్ యాజమాన్యం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి తలలు పట్టుకుంటున్నారు అంటూ అభిప్రాయపడ్డారు. ప్రభాస్ తో వచ్చిన ఎపిసోడ్స్ కి ఏకంగా అన్ స్టోపబుల్ ఆప్ క్రాష్ అవ్వగా ఇపుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఆహాకు కొత్తగా వచ్చిన చిక్కు లీకేజీ. షో గురించి గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అనే విషయాలు ముందే మీడియాకు లీక్ అవడం జరుగుతోంది.
ఇక షోలో ఏం ప్రశ్నలు వేశారు అన్నది కూడా లీక్ అవడం వల్ల ఆహా వాళ్ళు కోర్ట్ ను ఆశ్రయంచారు. అయితే దాసరి విజ్ఞాన్ మాట్లాడుతూ కోర్ట్ కి వెళితే ఏం లాభం దానికంటే ముందు షూటింగ్ అపుడు ప్రేక్షకులలాగా తీసుకుంటున్న జూనియర్ ఆర్టిస్టులు అలానే పబ్లిక్ విషయంలో జాగ్రత్త పడితే సరిపోతుంది. లీకేజీ బెడద తగ్గుతుంది అంటూ దాసరి విజ్ఞాన్ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…