Jayamalini : డెబ్భైయో దశకములో ఐటమ్ సాంగ్ అనగానే గుర్తొచ్చేది జ్యోతి లక్ష్మి, జయమాలిని . అప్పట్లో వీరిద్దరు ట్రెండ్ సెట్ చేసారు. ఎంతటి అగ్ర హీరో అయిన వీరి పాట ఒకటి ఉండాల్సిందే అన్నట్లుగా డిమాండ్ ఉండేది వీరికి. నిజానికి జయమాలిని వచ్చాక జ్యోతి లక్ష్మి కి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. మొదటి నుండి సినిమ నేపథ్యం ఉండటం వల్ల జ్యోతి లక్ష్మి గారు డాన్స్ నేర్చుకుంటున్న గురువు దగ్గరే జయమాలిని డాన్స్ నేర్చుకున్నారు. అలా ఒకసారి వారి ఇంటికి వచ్చిన విఠలాచార్యా గారు జయమాలినిని చూసి ఆయన తెలుగు సినిమా ‘ఆడదాని అదృష్టం’ లో అవకాశం ఇచ్చారు. ఇక జయమాలిని గారు అన్నదమ్ముల అనుబంధం సినిమాలో హీరోయిన్ గా చేసారు. ఇక జగన్మోహని సినిమాలో ఆమెకు మరింత క్రేజ్ వచ్చింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన జయమాలిని గారు ఆ తరువాత స్పెషల్ సాంగ్స్ లో ఒక ఊపు ఉపేశారు.
చనిపోయే ముందు అక్క బాధపడింది….
జ్యోతి లక్ష్మి గారి తరువాత ఇండస్ట్రీ కి వచ్చిన జయ మాలిని ఒకరకంగా ఆమెకు గట్టి కంపిటిషన్ ఇచ్చారు. అప్పట్లో జ్యోతి లక్ష్మి జయమాలిని ని దూరం పెట్టారు. మళ్ళీ చాలా రోజులకు జయమాలిని తో మాట్లాడారాట జ్యోతి లక్ష్మి అక్క అంటే చాలా భయం అంటూ చెప్పే జయమాలిని, జ్యోతి లక్ష్మి చివరి రోజుల గురించి మాట్లాడారు. జ్యోతి లక్ష్మి గారు బ్లడ్ క్యాన్సర్ తో మరణించారు. జయమాలిని చిన్నదైనా జ్యోతి లక్ష్మి గారు తన కూతురు విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే జయమాలిని ని అడిగేవారట.
నువ్వు నీ భర్త తో ఒకసారి వస్తే మాట్లాడాలి అంటూ ఫోన్ చేసేది అంటూ జయమాలిని ఎవరు శాశ్వతంగా శత్రువులు కాదు మిత్రువులు కాదు అంటూ తెలిపింది . ఇక కాన్సర్ తో బాధపడుతు చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సమయంలో మాట్లాడానంటూ జయమాలిని చెప్పారు. అప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉండేవారంటు బాగా మాట్లాడేవారంటు తెలిపారు. ఏదైనా నొప్పి అలా ఏమైనా ఉందా అని అడిగిన అదేం లేదు అంటూ చెప్పేవారని జయమాలిని చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…