Featured

Savithri daughter Vijaya chamundeswari : మహానటి లో ఎన్టీఆర్ పాత్రను చేయమని తారక్ ను అడిగాను…: విజయ చాముండేశ్వరి

Savithri daughter Vijaya chamundeswari: అలనాటి తార సావిత్రి గారు హీరోలకు ధీటుగా ఎదిగిన స్టార్. సినిమాల్లోకి వచ్చిన కొద్ది కాలానికే అగ్ర హీరోయిన్ గా ఎదిగి ఇప్పటికీ ఎంతోమందికి నటనలో బెంచ్ మార్క్ సెట్ చేసిన మహానటి. ఆమె వెండి తెర మీద ఒక వెలుగు వెలిగినా , నిజ జీవితంలో మాత్రం ఓడిపోయింది. భర్త వల్ల, నమ్మిన వారు మోసం చేయడం వల్ల ఆర్థికంగాను చితికి పోయి అలానే మానసికంగాను క్రుంగిపోయి మరణించారు. ఆమె జీవితకథను మహానటి గా సినిమా తీసి అలాంటి ఆ మహనటి గురించి ఈ తరం వారికి తెలియజేసారు. ఇక ఆ సినిమా గురించిన ఆసక్తికర విషయాలను సావిత్రి గారి కూతురు విజయ చముండేశ్వరి గారు పంచుకున్నారు.

ఆ పాత్రకోసం ఎన్టీఆర్ ను అడిగితే….

మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉందంటూ విజయ చముండేశ్వరి గారు ప్రశంసించారు. చిన్న చిన్న హావభావాలను కూడా చక్కగా పలికించింది అంటూ తెలిపారు. ఇక సినిమాలో నాగేశ్వరావు లాగా ఆయన మనవడు నటించగా ఎన్టీఆర్ లాగా ఆయన మనవడు తారక్ నటించుంటే బాగుండేదని విజయ అభిప్రాయపడ్డారు. ఆ సినిమాల్లో అదొక్కటే కొరత మిగిలిపోయిందంటూ చెప్పారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ ను అడిగానంటూ చెప్పారు.

మీరు మీ తాతగారి పాత్ర చేస్తే బాగుటుంది అని చెబితే ఆమ్మో మా తాతగారిని నేను చేయలేను భయం అంటూ చెప్పారట ఎన్టీఆర్. సినిమాలో అదొక్కటే నాకు అసంతృప్తి ఉంది అంటూ విజయ చాముండేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు ఉంటేనే సావిత్రి జీవిత కథ కాకపోతే సినిమాల్లో ఆయన పాత్రను చక్కగానే చూపించాడు డైరెక్టర్ అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago