Categories: FeaturedMovie News

Jayasudha : హీరోల కంటే వాళ్ళే ఎక్కువ చేస్తారు… పద్మశ్రీ లకు మేము పనికి రామా… కంగనా తో పని ఉంది కాబట్టి ఇచ్చారు : జయసుధ

Jayasudha : సహజనటిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో యాభై ఏళ్ల సుధీర్ఘ ప్రయాణం చేసిన జయసుధ అసలు పేరు సుజాత. చెన్నయి లో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి జయసుధ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ వంటి దిగ్గజ నటులతో ఎన్నో సినిమాలను నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక హీరోయిన్ గా ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కుడా అంతే గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రాజకీయాల్లోకి ప్రవేశించి సికింద్రాబాద్ ఎమ్మెల్యే గా గెలుపొందారు. ప్రస్తుతం సినిమాలను తక్కువగా చేస్తూ పాత్ర నచ్చితేనే సినిమా చేస్తున్న జయసుధ ఇటీవలే సినిమా ఇండస్ట్రీకి వచ్చి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ లోని అవకతవకలు, లోపాలను ఎత్తిచూపారు.

హీరోలకంటే పక్కన ఉన్న వారి డామినేషన్…

సినిమా ఇండస్ట్రీ లో వివక్ష ఉందని ఆమె తెలిపారు. హీరోలను ఒకలాగా హీరోయిన్లను ఒకలాగా చూస్తారని, ఒక పేద హీరోకి ఇచ్చిన వాల్యూ స్టార్ అయిన హీయిన్ కి ఉండదని చెప్పారు. హీరోలు డిమాండ్, డామినేషన్ చేయకపోయినా హీరో పక్కన ఉన్న వాళ్ళు ఎక్కువ చేస్తారని చెప్పారు. యాభై ఏళ్ల కెరీర్ కి సెలెబ్రేషన్స్ చేసి ఒక మంచి పార్టీ ఇవ్వచ్చు కదా నువ్వే అని నా సన్నిహితులు చెప్పినా నాకు చేయాలనిపించలేదు. ఇక ఒక్కరు కూడా నాకు అభినందనలు తెలుపలేదు. బాలీవుడ్ లో ఇలా ఒకవేళ ఒక హీరోయిన్ కి ఉంటే కనీసం బొకే అయినా పంపేవారని చెప్పారు. ఇక అవార్డుల గురించి కూడా మాట్లాడుతూ పద్మశ్రీ వంటి అవార్డులు తీసుకోడానికి మేము పనికి రామా అంటూ ఘాటుగా స్పందించారు.

ఆ అమ్మాయి కంగనా రనౌత్ కి ఇచ్చారు, మాకు ఇవ్వరు అనగా ఆమెతో అవసరం ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి ఆమెకు అవార్డు ఇచ్చారు అంటూ ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కే, రాధాకృష్ణ అన్నారు. ఇక హీరోల విషయంలో ఎలా సినిమా యూనిట్ ఉండేవారో చెప్పారు. హీరో సరిగా డాన్స్ వేయక పోయినా హీరోయిన్ ను పక్కకు పిలిచి సరిగా డాన్స్ వెయ్యి అంటూ అరిచిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. సినిమా ఇండస్ట్రీ లో తాను రెమ్యూనరేషన్ కోసం డిమాండ్ చేయడం వంటివి చేసుంటే ఇంత వరకు నా ప్రయాణం ఉండేది కాదు ఎప్పుడో ఇంటికి పంపే వారు అంటూ ఘాటుగా స్పందించారు. అయితే అవసరమైన చోట నా గొంతు ఖచ్చితంగా వినిపించానని చెప్పారు జయసుధ. ఏది ఏమైనా ఒక హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యాభై ఏళ్ళు విజయవంతంగా సినిమా రంగంలో పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం అందుకే ఆమె సినిమాల్లో సహజ నటి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago