Jayasudha: సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జయసుధ ఒకానొక సమయంలో హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. అయితే తాజాగా ఈమె హీరోలకు హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె నితిన్ కపూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు అయితే గత ఏడు సంవత్సరాల క్రితం నితిన్ మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన మరణించడానికి కారణం అప్పులేనని ఆర్థిక సమస్యలు ఎక్కువై అప్పుల అధికంగా ఉండడంతో మరణించారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ వార్తలపై జయసుధ స్పందించారు. అంతేకాకుండా తన భర్త ఆత్మహత్య చేసుకుంటాడని ముందే నాకు తెలుసు అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అప్పుల బాధతోనే తన భర్త మరణించాడు అనేది పూర్తిగా అవాస్తవమని తెలిపారు మేము చేసిన అప్పులు తీర్చుకోలేనంత పెద్దవి కాదని ఈమె తెలియజేశారు.
సినిమాలు చేసి నష్టపోయాము అనేది వాస్తవం కానీ దానివల్ల తన భర్త చనిపోయారన్నది అవాస్తవమని తెలిపారు. అంతేకాకుండా తన భర్త ముందే చనిపోతారు అనే విషయం మాకు తెలుసు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరిది చాలా వీక్ మైండ్ అని ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే దానిని బ్యాలెన్స్ చేయలేక సూసైడ్ ఆలోచనలు చేస్తారని ఇదివరకే తన భర్త అన్నగారు అలాగే తన అత్తయ్య వాళ్ళు కూడా అలాగే సూసైడ్ చేసుకొని చనిపోయారని జయసుధ తెలిపారు.
సినిమాలు చేసే నష్టపోయాం..
ఆర్థిక ఇబ్బందులు రావడంతో తను చాలా టెన్షన్ పడ్డారు. ఎక్కడ సూసైడ్ చేసుకుంటారోనని మేము ముందుగానే గ్రహించి తనని ఎప్పుడు ఓ కంట కనిపెడుతూనే ఉండే వాళ్ళం అయితే మేము ఇంట్లో లేని సమయంలో తాను సూసైడ్ చేసుకొని చనిపోయారని జయసుధ ఈ సందర్భంగా తన భర్త మరణం గురించి చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…