Featured

Jayavani : గుర్తింపు కోసం అలాంటి పాత్రలు చేశాను… నా ఫోటోలు తీసి వెబ్ సైట్ లో పెట్టారు…: జయవాణి

Jayavaani : సినిమా ఇండస్ట్రీ లో నీలదోక్కుకోవాలని చాలా మంది ఆశపడుతారు. కొంతమందికి కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చి మంచి అవకాశాలు అందుకుని ఇండస్ట్రీలో స్థిరపడుతారు. మరికొంతమందికి అలాంటి అవకాశం దొరకదు. అయితే కొంతమంది మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఈ కోవకే చెందుతారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయవాణి. గుంటూరు కి చెందిన జయవాణి కి సినిమాలంటే పిచ్చి. చిన్నతనం నుండే సినిమా మీద ఆసక్తి తో అటు వైపు వెళ్లాలని అనుకునేది. ఇది గమనించిన పెద్దలు త్వరగా పెళ్లి చేసేసారు. అయితే భర్త సహకారంతో సినిమా ఇండస్ట్రీ కి వచ్చింది జయవాణి.

నా ఫోటోలను వెబ్ సైట్లలో చూసి షాక్ అయ్యాను…

గుమ్మడి జయవాణి డిగ్రీ వరకు చదివి సినిమా ప్రయత్నాలు భర్త సహకారంతో చేసింది. అయితే మొదట సీరియల్ లో అవకాశాలు వచ్చాయి ఆ తరువాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన జయవాణికి విక్రమార్కుడు సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. ఆ తరువాత ఛత్రపతి, యమదొంగ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయవాణికి అలాంటి పాత్రలు చేయడం అంత ఇష్టం లేక పోయినా ఇండస్ట్రీ లో గుర్తింపు రావాలని చేశారట. ప్రస్తుతం కేవలం కామెడీ పాత్రలను మాత్రమే చేయాలని జయవాణి అనుకుంటున్నారట. జయవాణి అంటే ఇపుడు చాలా మంది దర్శకులకు తెలుసు కాబట్టి ఇకపై అలాంటి పాత్రలు చేయకూడదని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇక అలాంటి పాత్రలు చేస్తున్న సమయంలోనే ఒక కొత్త ప్రాజెక్ట్ లో నటించడానికి అని పిలిచి నన్నుపొట్టి దుస్తులు వేసుకుని నప్పుతుందో లేదో చూద్దాం అని అడిగి చివరికి ఫోటోలు తీసి నెట్టింట్లో పెట్టారు.

సినిమాలో అవకాశం అని చెప్పి ఫోటోలు తీశారు. ఆ డైరెక్టర్, ఆ నిర్మాత ఇద్దరు కొత్త వాళ్ళే. కానీ నమ్మి వెళితే ఫోటో షూట్ అని చెప్పి అలా ఫోటోలు తీసి వెబ్ సైట్ లో పెట్టారు. కొన్ని రోజులకు అవి వెబ్ సైట్ లో చూసాక అవి తీసేయడానికి ఎవడిని అడగాలో తెలియదు ఆ స్టిల్స్ తీసిన ఫోటో గ్రాఫర్ కాంటాక్ట్ కూడా నా దగ్గర లేదు అలా నా కెరీర్ లో అదొక మచ్చ లాగా మారింది. అలాంటి పాత్రలు చేసే వాళ్లంతా అలాగే నిజజీవితంలో ఉండరు. విలన్ పాత్రలు చేసే వాళ్ళు నిజ జీవితంలో అలా ఏం ఉండరు కదా.. సోనూ సూద్ గారే ఉదాహరణ. ఇక అలాంటి పాత్రలు చేయకుండా సినిమాల్లో నటించేవారు నిజజీవితంలో అలానే మంచి క్యారెక్టర్ తో ఏమి ఉండరు కదా అంటూ జయవాణి తన సినిమా అనుభవాలను చెప్పారు.

Bhargavi

Recent Posts

శ్రీశైలంలో కాసుల వర్షం… విదేశీ కరెన్సీ కూడా భారీగా!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తి ఉత్సాహం మరోసారి స్పష్టంగా కనిపించింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం హుండీ…

6 minutes ago

ఈ చిన్న అలవాట్లు మీ పళ్ళను నెమ్మదిగా నాశనం చేస్తున్నాయా?

మన రోజువారీ జీవితంలో తెలియకుండానే చేసే కొన్ని అలవాట్లు దంతాల ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయి. పళ్ళపై ఉండే తెల్లటి రక్షణ…

11 minutes ago

వంటింట్లోనే హెల్త్ సీక్రెట్… మెంతులు ఎందుకు తినాలి?

మన వంటింట్లో సాధారణంగా కనిపించే మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహార పదార్థంగా గుర్తింపు పొందుతున్నాయి. పరిమాణంలో చిన్నగా…

16 minutes ago

రాత్రి నిద్రలో ఈ అలవాటు ఉంటే జాగ్రత్త… దంతక్షయం పెరుగుతుంది!

నిద్రలో నోరు తెరిచి శ్వాస తీసుకోవడం చాలా మందిలో కనిపించే సాధారణ అలవాటు. అయితే ఇది చిన్న విషయం అనిపించినా,…

25 minutes ago

దేవుడు ఎక్కడైనా ఉన్నాడంటే… గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద చెప్పిన అసలు సత్యం!

దేవుడు ప్రతిచోటా ఉన్నాడనే భావన అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ప్రధానంగా వినిపిస్తుంది. అయితే అదే సమయంలో మనుషులు ఆలయాలు, మసీదులు,…

33 minutes ago

వేదమంత్రాల నడుమ అద్భుత వేడుక… పాల్ఘర్‌లో మందిర ప్రతిష్ఠ!

మహారాష్ట్ర తీరప్రాంతంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పాల్ఘర్‌ జిల్లా పరిధిలోని దుర్వేస్ గ్రామం ఇటీవల భక్తి వాతావరణంతో కళకళలాడింది. బిఎపిఎస్…

1 hour ago