Jeevitha Rajashekar : ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు దర్శక, నిర్మాత అయిన జీవిత రాజశేఖర్ మీద గరుడవేగ సినిమాకు సంబందించిన వివాదాలు ఇంకా వీడటం లేదు. గరుడవేగ సినిమా నిర్మాతలు అయిన జ్యో స్టార్ సంస్థ అధినేతలు కోటేశ్వరరాజు, హేమ దంపతులు గత కొంత కాలంగా జీవిత రాజశేఖర్ మీద ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజశేఖర్ వల్ల నాన్న గారు పరిచయం కారణంగా జీవిత అడగగానే 26 కోట్లు సినిమా కోసం ఇచ్చామని, సినిమా హిట్ అయినప్పటికీ మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వలేదని వీరి వాదన. అంతేకాకుండా గతంలో రాజశేఖర్ డ్రగ్స్ తీసుకోవడం గురించి, యాక్సిడెంట్ గురించి చాలా ఆసక్తికర ఆరోపణలు చేశారు. అయితే తాజాగా మరోసారి వీరు మీడియా ముందుకు వచ్చారు.
మరో సారి మీడియా ముందుకు కోటేశ్వరరాజు దంపతులు…..
మరోసారి గరుడవేగ వివాదం తో మీడియా ముందుకు వచ్చిన కోటేశ్వరరాజు దంపతులు జీవిత మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. మా డబ్బులు ఇవకాకపోగా మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఈసారి జీవిత జైలుకు వెళ్లడం ఖాయం అని జ్యోష్యం చెప్పారు. సహాయం చేయమని అడిగిన, జీవిత, రాజశేఖర్ ఇద్దరూ తమని నట్టేట ముంచడమే కాకుండా ఇపుడు తాము ఎవరో తెలియదు అన్నట్టు నటిస్తున్నారని ఆరోపించారు. జీవిత రాజశేఖర్ మా దగ్గర డబ్బులు తీసుకుని అగ్రిమెంట్ చేయించుకున్న విషయం వాస్తవం కాదా అని వారు ప్రశ్నించారు. అంతే కాకుండా మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు వున్నాయి కాబట్టే మాట్లాడుతున్నామని, జీవితారాజశేఖర్ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని వారు చెప్పేవన్నీ అబద్దాలు అని వారు స్పష్టం చేశారు.
ఇక కోటేశ్వరరాజు సతీమణి అయిన హేమ కూడా జీవితపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. మా వద్ద వారు డబ్బులు తీసుకోవడం నిజం అని, మా దగ్గర 26 కోట్లు అప్పు తీసుకున్నదే కాకుండా, ప్రజల్లో మమ్మల్ని మభ్య పెడుతున్నారని ఆమె తెలియజేసారు. వాళ్ళు పెట్టే భాధలు ఎక్కవగా ఉన్నాయాని, సమాజం లో మమ్మల్ని బతకనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవత పై కి చాలా అమయాకురాలిగా కనిపిస్తారు కానీ, చాలా ప్రమాదకమైన లేడీ అని ఆమె ఆరోపించారు. జీవిత ని నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు. కోటేశ్వర రాజు దంపతులు తాము అప్పు ఇచ్చినందుకు షూరిటీ గా పెట్టిన ప్రాపర్టీ ని తమకు తెలియకుండా అమ్మేశారని ఆరోపిస్తున్నారు. అయితే కోటేశ్వరరాజు దంపతులు చేసే ఆరోపణల్ని జీవిత తీవ్రంగా ఖండిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…