Featured

Venkaiah Naidu : సినిమాల పై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు..

Venkaiah Naidu : తాజాగా శిల్పకళావేదికలో జరిగిన సిరివెన్నెల జయంతి వేడుకలలో మన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు పాల్గొన్నారు. తానా ప్రపంచ వేదిక, సిరివెన్నెల కుటుంబసభ్యులు సంయుక్తంగా కలసి శిల్పకళావేదికలో సిరివెన్నెల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న వెంకయ్య నాయుడు గారు సిరివెన్నెల గురించి మాట్లాడుతూ…సిరివెన్నెల నిశ్శబ్ద పాటల విప్లవం అని ఆయన కొనియాడారు. రోజు తాను తెల్లవారుజామున నిద్ర లేచి మొదట అన్నమాచార్య కీర్తనలు ఇంకా సిరివెన్నెల పాటలు వినిన తర్వాతే నా రోజు ప్రారంభం అవుతుంది అని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వన్ టైమ్ హీరో ఆఫ్ టైమ్ హీరోయిన్ అన్నట్లు….

సిరివెన్నెల జయంతి వేడుకలలో పాల్గొన్న వెంకయ్య నాయుడు గారు సినిమాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత సినిమాలను గుర్తు చేసుకున్న ఆయన మాయాబజార్ సినిమా అప్పటి లోనే 100 రోజులు ఆడింది అని తెలియజేశారు. ప్రస్తుత సినిమాలు విడుదలైన తర్వాత ఫస్టు కూడా ఉంటుందో లేదో అన్నట్లు ఉంటున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా సినిమాలలో డబల్ మీనింగ్ కంటే ముందు అసలు మీనింగ్ ఏంటో అర్థమయ్యేలా చెప్పాలి అని పేర్కొన్నారు. సినిమాలు తీసే దర్శకులు హీరో హీరోయిన్లు ముందుగా వాల్ల సినిమాలను వారి కుటుంబ సభ్యులతో కలిసి చూసి వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం వచ్చే సినిమాలు కొన్ని చూడటానికే వెగటు పుట్టిస్తూ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కాలంలో సినిమాల పరిస్థితిని ఆయన వివరిస్తూ వన్ టైమ్ హీరో ఆఫ్ టైమ్ హీరోయిన్ అన్నట్లు ఇప్పటి సినిమాలు ఉన్నాయని తెలియజేసారు. ఈ సినిమాల తీరును చిత్ర పరిశ్రమ తప్పకుండ సరిద్దిదుకోవాలని ఆయన సూచించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago