NTR 30: ఒక్క పోస్టర్ తో అడ్డంగా బుక్కయిన కొరటాల.. భారీగా ట్రోల్ చేస్తున్న అభిమానులు!
NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRRఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రానికి కొరటాల శివతో చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాపై అభిమానులు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటేనే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిన్న ఎన్టీఆర్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సినిమా నుంచి ఒక వీడియోని విడుదల చేశారు.
ఈ వీడియోలో ఎన్టీఆర్ మొహం కనిపించక పోయినప్పటికీ ఎన్టీఆర్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమా పక్కా హిట్ అని ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్న సమయంలో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కొరటాల ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా ఇది వరకే అల్లు అర్జున్ చేయాల్సిన సినిమా అని అదే కథతోనే కొరటాల తారక్ తో సినిమా చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తో కొరటాల శివ మాస్ ఎంటర్ టైనర్ తెరకెక్కించాలని అనుకున్నారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్దఎత్తున ఎన్టీఆర్ అభిమానులు కొరటాల శివను ట్రోల్ చేస్తున్నారు.
NTR30 పోస్టర్..అల్లు అర్జున్ 21 లుక్స్ ఒకే విధంగా ఉండటంతో నెటిజన్లు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై కొరటాల ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…