Categories: FeaturedMovie News

Jeevitha Rajashekhar: ప్రతి ఒక్కరి లైఫ్‌లో ‘శేఖర్‌’ ఉంటాడు.. జీవిత రాజశేఖర్

Jeevitha Rajashekhar : జీవిత రాజశేఖర్ గురించి తెలుగు ప్రేక్షకులకీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా, ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. జీవిత రాజశేఖర్ తాజాగా రాజశేఖర్ ప్రధాన పాత్రలో ‘శేఖర్’ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వీరి కుమార్తె శివాని రాజశేఖర్‌ కూడా నటించింది. ఈ చిత్రన్ని వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, శివాని రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 20న విడుదల చేయనున్న సందర్భంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా డైరెక్టర్‌ జీవిత రాజశేఖర్‌ మీడియాతో ముచ్చటించారు. 

దర్శకత్వం మీద ఆసక్తి లేకపోయినా శేషు సినిమా ద్వారా తప్పని పరిస్థితుల్లో దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు. మలయాళంలో హిట్‌ సాధించిన జోసెఫ్‌ సినిమాను శేఖర్‌ పేరుతో తీయాలన్న ఆలోచనతో ‘పలాస’ డైరెక్టర్‌ కరుణ కుమార్‌, నీలకంఠను కలవడం జరిగింది వారు బిజీగా ఉండటం కారణంగా నేనే ఈ సినిమాను డైరెక్షన్‌ చేశాను. మనసున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ‘శేఖర్‌’ లాంటి వాడు ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటాడు అనేలా ఈ మూవీ అందరికి కనెక్ట్‌ అవుతుంది, అని జీవిత చెప్పారు.

వాళ్ళే థంబ్‌నేయిల్స్‌ పెట్టి దూరాన్ని పెంచుతున్నారు….

ఈ మీడియా సమావేశం లో మెగాస్టార్ తో గొడవల గురించి ప్రస్థావించగా… అందుకు జీవిత మాకు ఎవరితోనూ ఏ గొడవలు లేవు కానీ చిరంజీవి గారితో ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని రిపీట్ చేస్తూ.. యూట్యూబ్ వాళ్లే థంబ్‌నేయిల్స్‌ పెట్టి మా మధ్య ఇంకా దూరాన్ని, గొడవల్ని పెంచుతున్నారు’, అని చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ…. రాజశేఖర్ గారు నెగిటివ్ రోల్స్ లో నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా…ధ్రువ” లోని అరవిందస్వామి లాంటి పాత్ర , పెదరాయుడులోని రజినీకాంత్ క్యారెక్టర్ వంటి అన్‌టచబుల్ పాత్ర వస్తే తప్పకుండ చేస్తారని, చిరంజీవి తో కలసి నటించడానికి కూడా సిద్ధం అని చెప్పారు. అంతే కాదు తాను మంచి పాత్రాలు వస్తే నటిస్తానని తెలియజేసారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago