Categories: FeaturedMovie News

Aacharya: ఆచార్య నష్టాల్ని పూడ్చడానికి ముందుకు వచ్చిన ఆ ముగ్గురు…!

Aacharya: మెగాస్టార్ చిరంజీవి ఆయన కొడుకు రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇంతవరకు అసలు పరాజయం ఎరుగని కొరటాల శివ మొదటిసారి ఈ సినిమాతో భారీ పరాజయాన్ని చూసారు. ఈ సినిమాతో చాలా రోజుల తరువాత మణిశర్మ, చిరంజీవి సినిమాకు సంగీతం అందించారు. ఇక సినిమాలో తోలుత చిరంజీవి పక్కన కాజల్ హీరోయిన్ గా అనుకున్నా తరువాత ఆమె ఉన్న సన్నివేశాలు తొలగించి చిరుకి జోడి లేకుండా కథ తీర్చిదిద్దారు.

ఇక రామ్ చరణ్ సరసన పూజహెగ్డే హీరోయిన్‌గా నటించినా ఆమెకు పెద్ద సన్నివేశాలేమి లేవు. ఇక సినిమాలో ఇద్దరు హీరోలను బ్యాలెన్సింగ్ సరిగా చేయలేదని ఎడిటింగ్ లో విఫలమయ్యారని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఇక సినిమాను పూర్తి చేయడానికి కరోనా లాక్ డౌన్ వల్ల నాలుగు సంవత్సరాలు పట్టడంతో సినిమా కథలో చాలా మార్పులు చేసారు. ఇక ఎన్ని సంవత్సరాలు సినిమా సాగడంతో సినిమా బడ్జెట్ బాగా పెరిగింది. అది కాక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంత బాగా ఏమి జరగలేదు.

ఇక సినిమాపై అభిమానుల అంచనాలు బాగా ఉన్నా సినిమా మాత్రం మొదటి రోజునుండే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుని డిజాస్టర్ గా మిగిలింది. బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇక ఈ విషయంలో చిరంజీవికి కూడా లేఖ రాసారు. బయ్యర్ల నష్టాలపై స్పందించకపోతే బయ్యర్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి అంటూ బాధను లేఖ రాసారు. ఇక సినిమా నష్టంపై ఇపుడు కొరటాల స్పందించారు. కొరటాలతో పాటు చిరంజీవి, రామ్ చరణ్ లు కూడా ఎంతో కొంత డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.

130 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినా సినిమా లాభాలను రాబట్టకపోగా భారీ నష్టాలను మిగిల్చింది. అందుకే ఇప్పటికే చిరంజీవి 10కోట్లు ఇచ్చారట, ఇంకొంత మొత్తం త్వరలో ఇస్తారట, ఇక కొరటాల కూడా 25 కోట్లు ఇచ్చారని సమాచారం. ఒక దర్శకుడు ఇంత భారీ మొత్తంలో డబ్బు నష్టాన్ని పుడ్చడానికి బయ్యర్లకు ఇవ్వడం ఇదే తొలిసారి. అందుకే అందరూ కొరటాలను అభినందిస్తున్నారు. ఇక రామ్ చరణ్ కూడా ఈ విషయంలో బయ్యర్లకు సహాయం చేయాలనుకుంటున్నారట అందుకే ఆయన కూడా త్వరలో డబ్బు ఇవ్వాలనుకుంటున్నారట. సినిమా ముక్కి మూలిగి 50 కోట్లు వసూలు చేసింది. ఇక 80 కోట్ల నష్టాన్ని బయ్యర్లు భరించాలి. ఇక దీంతో బయ్యర్లు రోడ్డున పడ్డారు. ఇక ఈ విషయంలో ముగ్గురు ఇలా బయ్యర్లకు ఎంతోకొంత డబ్బు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago