తెలుగులో కొనసాగుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో 10 వ వారం ఊహించని విధంగా బిగ్ బాస్ ఇంటి నుంచి జెస్సీ బయటికి వచ్చేశాడు. వర్టిగో సమస్యతో బాధ పడుతున్న ఈయనను ఇంటి నుంచి బయటకు వచ్చి.. అతడికి సీక్రెట్ రూంలో ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఎలిమినేషన్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారింది.
నామినేషన్స్‌లో కూడా లేని జెస్సీ ఇలా సీక్రెట్ రూంలో ఉంచేసరికి ఏం జరగబోతుందో అర్థం కావడం లేదు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో జెస్సీ తన సమస్యకు ఇంకా పరిష్కారం లభించలేదని తెలుస్తోంది. తనకు వర్టిగో సమస్య ఇంకా ఎక్కువగా అవుతుందని.. తన తల కూడా తిరుగుతుందని జెస్సీ బిగ్ బాస్ కు విన్నవించాడు.
పడుకున్న సమయంలో తన పక్కన పాములు వచ్చినట్లుగా అనిపిస్తుందని.. చెప్పడంతో అతడిని చెకప్ చేసేందుకు డాక్టర్ వచ్చారు. తనకు ఎక్కువగా వైద్యం అవసరం అని డాక్టర్ చెప్పడంతో… అందుకు తగ్గట్లు ట్రీట్ మెంట్ ఇస్తామని ధైర్యం చెప్పాడు. ఇదంతా చూసిన తర్వాత అతడు ఇంటి నుంచి బయటకు వచ్చే సూచనలే ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇక ఈ వారం ఎలిమినేషన్ పై తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. జెస్సీ ఆరోగ్యం మంచిగా ఉండి హౌస్ లోకి అడుగుపెడితే.. కాజల్ ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. జెస్సీ ఇంటి నుంచి బయటకు వెళ్తే మాత్రం.. ఈ వారం ఎలిమినేషన్ లేనట్లే అనేది కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…