తెలుగు సినిమాలో బెస్ట్ అండ్ క్యూట్ కపుల్స్ లో చెప్పుకోదగిన జంట రామ్ చరణ్, ఉపాసన. ఎంతో అన్యోన్యంగా ఉంటుంది ఈ జంట. వీరికి పెళ్లై ఎనిమిదేళ్ళు అవుతోంది. అయితే ఇంకా పిల్లల విషయంలో ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా అందరూ ఒకే పీరియడ్‌లో పెళ్లిళ్లు చేసుకున్నారు.
అయితే ఇందులో రామ్ చరణ్ తప్పా మిగిలిన హీరోలిద్దరూ తండ్రులు అయ్యారు. దీంతో ఎక్కడికెళ్ళినా పిల్లలు ఎప్పుడనే ప్రశ్న ఉపాసనకు ఎదురవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లల విషయంలో క్లారిటీ ఇచ్చింది ఉపాసన. పిల్లల విషయం ఎందుకు లేట్ చేస్తున్నారంటూ ప్రశ్నించగా.. ఆ ప్రశ్నకు ఆమె కాస్త అసహనానికి లోనయింది.
జూనియర్ రామ్ చరణ్.. జూనియర్ ఉపాసన ఎప్పుడు వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అని యాంకర్ అడిగింది. దానికి ఉపాసన కాస్త ఘాటుగా స్పందించింది. పిల్లల విషయం తన వ్యక్తిగతమని చెప్పుకొచ్చింది ఉపాసన. దీనిపైన చాలామంది అడుగుతున్నప్పటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేసింది.
ఇప్పుడు నేను దాని మీద ఎలా స్పందించినా కూడా మీడియాలో సెన్సేషన్ అవుతుంది. అనుకునే వాళ్లు ఏదైనా అనుకోనివ్వండి.. నేను దీనికి సమాధానం చెప్పను. మీరు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. దీనికి సరైన సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని తెలిపింది. కాగా రామ్ చరణ్ నటించిన సినిమాలలో రంగస్థలం చిత్రం తనకెంతో ఇష్టమని వెల్లడించింది ఉపాసన.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…