Featured

Jinna Movie: దిల్ రాజు వల్ల చిన్న సినిమాలు నష్టపోతున్నాయా.. జిన్నా సినిమా పై పగ పట్టారు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు?

Jinna Movie: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.ఒక సినిమాని చేయాలంటే చిన్న నిర్మాతలకు అధిక భారంగా మారుతుందని గత కొద్ది రోజుల క్రితం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సినిమాలను షూటింగ్లను ఆపివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విషయాల గురించి తాజాగా నిర్మాత రామ సత్యనారాయణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చిత్ర పరిశ్రమ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఒక సినిమాని థియేటర్లో విడుదల చేయాలంటే వారానికి వీపీఎఫ్ చార్జీలను పదివేలకు పైగా చెల్లించాల్సి ఉంటుందనీ వెల్లడించారు.భారీ బడ్జెట్ సినిమాలకు ఇలా విపిఎఫ్ చార్జీలను చెల్లించడం పెద్ద సమస్య కాదు కానీ చిన్న నిర్మాతలకు అది అదనపు భారంగా మారుతుందని నిర్మాత రామ సత్యనారాయణ వెల్లడించారు. ఒక చిన్న నిర్మాత కోటి రూపాయలు పెట్టి సినిమా చేస్తే ఒకవేళ ఆ సినిమా నష్టం వస్తే కోటి రూపాయలతో పాటు సినిమా ప్రమోషన్ల కోసం ఖర్చు చేసే డబ్బులు ఇలా ఈ వీపీఎఫ్ చార్జీల వల్ల అదనపు భారం తమాపై పడుతూ భారీగా నష్టపోతున్నారని అందుకే చిన్న నిర్మాతలు ఇండస్ట్రీకి దూరమవుతున్నారని ఈయన పేర్కొన్నారు. ఇలా ఒక చిన్న సినిమా నిర్మాత సినిమా ఫెయిల్ అయితే 140 శాతం నష్టపోవాల్సి వస్తుందని ఈయన తెలిపారు.

ఇకపోతే దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి ఎంతోమంది ప్రొడ్యూసర్ల చేతిలో పెద్ద ఎత్తున థియేటర్లో ఉన్నాయి అయితే దిల్ రాజు గారు చిన్న సినిమాలకు ఈ విధమైనటువంటి విపిఎఫ్ చార్జీలు ఉండవని ఆయన చిన్న సినిమా నిర్మాతలను ఎంతగానో ప్రోత్సహించారని రామ సత్యనారాయణ పేర్కొన్నారు.ఇకపోతే ఇంటర్వ్యూలో భాగంగా మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమాపై ప్రేక్షకులు పగ పట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jinna Movie: ప్రమోషన్లకు కోటి రూపాయలు ఖర్చుపెట్టిన విష్ణు..

జిన్నా సినిమాలో సుమారు పాతిక కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి చేశారు.ఈ సినిమాలో క్యాస్టింగ్ తో పాటు సినిమా కూడా అద్భుతంగా ఉంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఈ సినిమా భారీగా నష్టపోయిందని ప్రేక్షకులు సినిమాపై పగ పట్టారంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మంచు విష్ణు ఈ సినిమాని భారీ బడ్జెట్ పెట్టి కేటాయించినప్పటికీ ఈ సినిమా ప్రమోషన్ల కోసం సుమారు కోటి రూపాయలకు పైగా ఖర్చుపెట్టి నష్టపోయారంటూ ఈయన వెల్లడించారు. ప్రస్తుతం జిన్నా సినిమా గురించి రామ సత్యనారాయణ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

లీక్ వెనుక రాజకీయ కుట్రా..? అభిమానుల ఆరోపణలు హాట్ టాపిక్..!

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన “జననాయగన్” సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ…

7 minutes ago

3 పీహెచ్‌డీలు, 46 పీజీలు! 138 డిగ్రీలు సాధించిన మాజీ సైనికుడు..

విద్యపై పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులైనా అడ్డుకావని మరోసారి నిరూపించిన వ్యక్తిగా రాజస్థాన్‌కు చెందిన మాజీ సైనికుడు దశరథ్ సింగ్…

27 minutes ago

2027 పుష్కరాల కోసం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్.. కోట్లాది భక్తుల కోసం స్నాన ఘట్టాల విస్తరణ!

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాజమహేంద్రవరంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఈ మహోత్సవానికి భారీగా భక్తులు…

40 minutes ago

చందనోత్సవం కోసం 70 బస్సులు..అప్పన్న దర్శనానికి ప్రత్యేక ప్లాన్.. భక్తుల కోసం ప్రత్యేక చర్యలు!

సింహాచలం దేవస్థానంలో ఈ నెల 20న జరగనున్న అప్పన్న స్వామి చందనోత్సవానికి విస్తృతంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది జరిగే…

60 minutes ago

“తెలుగు కోడలిగా మారిపో”.. మృణాళ్‌కు అరవింద్ సూచన వైరల్

టాలీవుడ్‌లో తాజాగా విడుదలైన సినిమా వేడుకలో జరిగిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మృణాళ్…

1 hour ago

గానలెజెండ్ ఆశా భోంస్లే కన్నుమూత.. ఐపీఎల్‌లో నల్ల బ్యాండ్లతో నివాళి

భారత సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు అలరించిన గానలెజెండ్ ఆశా భోంస్లే కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని…

1 hour ago