Puri Jagannadh: పూరి జగన్నాథ్ గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన పాన్ ఇండియా స్థాయిలో లైగర్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ డిజాస్టర్ కావడంతో పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూటర్లు తమ డబ్బు తమకు వెనక్కి తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలా చేయని పక్షంలో ధర్నాలు చేస్తామంటూ డిస్ట్రిబ్యూటర్లు పూరికి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ వీడియో పై తాజాగా నిర్మాత నటి కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైజర్ సినిమాకి వరంగల్ శీను, శోభన్ వంటి వారు డిస్ట్రిబ్యూటర్లుగా వ్యవహరించారు. వీరికింద ఎంతో మంది ఎగ్జిబిటర్ లు ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయ్యి డిజాస్టర్ కావడంతో డబ్బులు వెనక్కి తిరిగి చెల్లించాలని డిస్ట్రిబ్యూటర్లు కోరారు.
ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్లు కోరడంతో తనకు కొంత సమయం కావాలని తిరిగి డబ్బు చెల్లిస్తామని పూరి జగన్నాథ్ చెప్పారు. అయితే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉండడంతో పూరి జగన్నాథ్ ఇచ్చిన డబ్బులను డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే తీసుకొని ఎగ్జిబిటర్లకు ఇవ్వకుండా మోసం చేస్తారేమోనని భావించి కొందరు ఎగ్జిబిటర్లు పూరి జగన్నాథ్ ను కలిసి డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు ఇచ్చే సమయంలో తమకు కూడా సమాచారం అందించమని చెప్పాలని తన ఆఫీసు వద్దకు వెళ్లాలని భావించారు.
ఈ క్రమంలోనే కొందరు ధర్నా చేయడానికి వెళ్తున్నామంటూ సోషల్ మీడియాలో చెప్పడంతో నేనే స్వయంగా పూరి జగన్నాథ్ ఆఫీస్ వద్దకు ఎగ్జిబిటర్లందరూ ధర్నా చేయడానికి వస్తున్నారంటూ రాంగోపాల్ వర్మకు చెప్పడం రాంగోపాల్ వర్మ పూరి జగన్నాథ్ కు మెసేజ్ పంపించడం జరిగింది అంటూ నట్టి కుమార్ వెల్లడించారు.తన పరువు పోకుండా ఉండడం కోసం పూరి జగన్నాథ్ డబ్బును తిరిగి వెనక్కి ఇస్తానని చెప్పారు. అయితే తన పరువు తీసేలా ధర్నా చేస్తామని చెప్పడంతో ఈయన డబ్బును ఇవ్వనని తనకు ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని ఈ సందర్భంగా నటి కుమార్ వెల్లడించారు. అయితే కేవలం ఇక్కడ అపార్థం చోటు చేసుకోవడం వల్లే ఈ విషయం ఇలాంటి పరిణామాలకు దారి తీసిందని ఇలా ఎగ్జిబిటర్లు ఆచార్య సినిమా విషయంలో కూడా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర మోసపోవడం వల్లే ఈ విషయాన్ని పూరి వరకు చేర్చాలని భావించారని నట్టి కుమార్ క్లారిటీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…