Featured

Balakrishna -Chiranjeevi: సంక్రాంతి బరి తప్పుకోవాలని బాలయ్య పై ఒత్తిడి తెచ్చిన మైత్రి మూవీ మేకర్స్… బాలయ్య రియాక్షన్ ఇదే?

Balakrishna -Chiranjeevi:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి హీరోల సినిమాలు పోటీ పడటం సర్వసాధారణం ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి నరసింహ బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఒకేసారి పెద్ద ఎత్తున పోటీ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అయితే తాజాగా ఈ ఇద్దరు హీరోల మధ్య మరోసారి పెద్ద ఎత్తున పోటీ ఏర్పడనుందని తెలుస్తుంది.మైత్రి మూవీ మేకర్ నిర్మాణంలో బాలకృష్ణ చిరంజీవి ఇద్దరు కూడా సంక్రాంతికి సినిమాలను విడుదల చేయబోతున్నారు.

ఈ క్రమంలోనే ఓకే నిర్మాణ సంస్థలో తెర కెక్కిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అయితే కలెక్షన్లకు దెబ్బ పడుతుందన్న ఉద్దేశంతో మైత్రి మూవీ మేకర్స్ బాలకృష్ణను సంక్రాంతి బరి నుంచి తప్పుకోవాలని ఆయనని ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై బాలయ్య రియాక్షన్ వల్ల మైత్రి మూవీ మేకర్స్ కాస్త టెన్షన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్ మైత్రి మూవీ మేకర్స్ బాలయ్య సినిమాని వెనక్కు తగ్గాలని ఎందుకు చెబుతున్నారు అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి పోటీ పడబోతున్నాయి. అయితే నిర్మాతలు బాలకృష్ణను వెనక్కు తగ్గమని చెప్పడానికి ఓ కారణం ఉందని భరద్వాజ వెల్లడించారు.వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి పూర్తి మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఈ తరహా పాత్రలలో చిరంజీవి నటించి చాలా కాలం అయింది.ఇక ఈ మధ్యకాలంలో చిరంజీవి సినిమాలు కాస్త కలెక్షన్ల విషయంలో వెనుక పడ్డాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి కానుకగా చిరంజీవి సినిమాను విడుదల చేస్తే మంచి కలెక్షన్లను రాబడతాయన్న ఉద్దేశంలో మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారని ఈయన క్లారిటీ ఇచ్చారు.

Balakrishna -Chiranjeevi: బాలయ్య నిర్ణయంతో టెన్షన్ లో మైత్రి మూవీస్…

ఇకపోతే వీరసింహారెడ్డి సినిమా పూర్తి పొలిటికల్ యాక్షన్ సినిమా. ఈ తరహా సినిమాలు బాలకృష్ణ ఎన్నో సినిమాలలో చేశారు కనుక ఈ సినిమాని మరి కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని బాలకృష్ణను సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాలకృష్ణ మాత్రం తగ్గేది లే అంటూ తన సినిమాని తప్పనిసరిగా సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించారట.బాలకృష్ణ సంక్రాంతి బరి నుంచి తన సినిమా తప్పుకోవాలంటే మైత్రి మూవీ మేకర్స్ వారికి ఓ ఆఫర్ కూడా ఇచ్చారని ఈ సందర్భంగా భరద్వాజ తెలిపారు.తన సినిమా సంక్రాంతి భరి నుంచి తప్పుకోవాలంటే సినిమా కోసం ఎంత మేర ఖర్చు పెట్టారో ఆ డబ్బును వేరే ప్రొడక్షన్ చెల్లించి ఆ సినిమాని అమ్మితే ఆ ప్రొడక్షన్ నుంచి సంక్రాంతి కానుకగా విడుదల చేస్తానని బాలయ్య చెప్పారట.ఇలా బాలకృష్ణ ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని పట్టు పట్టారని జర్నలిస్ట్ భరద్వాజ పేర్కొన్నారు. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా ఏ హీరో వీరులవుతారో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago