Movie News

Jogi Naidu: పవన్ గాలి వాటం రాజకీయాలు చేస్తున్నారు… నిజమైన పొలిటీషియన్ జగన్ మాత్రమే: జోగి నాయుడు

Jogi Naidu: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే ఇక్కడ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై వైసిపి మద్దతు దారుడు, ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ హెడ్ గా ఉన్న జోగి నాయుడు తాజాగా పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జోగి నాయుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పవన్ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా జోగి నాయుడు మాట్లాడుతూ తాను చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీ కార్యకర్తగా పని చేశానని తెలిపారు.అయితే కొన్ని సంవత్సరాలకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఐడియాలజీ తనకు ఏమాత్రం నచ్చలేదని తెలిపారు.పవన్ సిద్ధాంతాలు నచ్చిన ఆయన చేసే పనులన్నీ సినిమాటిక్ గా ఉంటాయని తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలలో నటిస్తూనే గాలివాటం రాజకీయాలు చేస్తున్నారని ఆ తర్వాత మాయమైపోతారని జోగినాయుడు తెలిపారు. పవన్ కళ్యాణ్ కి సినిమాలు ప్రొఫెషనల్ రాజకీయాలు కాదని తెలియజేశారు. కానీ జగన్ కి రాజకీయమే ఒక ప్రొఫెషన్. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. కానీ ఆ వ్యాపారాల బాధ్యతలన్నింటిని ఆయన ఇతరులకు అప్పగించారు.

Jogi Naidu: పవన్ సినిమాలలో ప్రొఫెషనల్…

ఇలా వ్యాపారాలను ఇతరులకు అప్పగించి ఆయన పూర్తి రాజకీయ నాయకుడిగా ప్రజలలోనే ఉంటున్నారని తెలిపారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలా కాదు.ఎన్నికలు అయిపోగానే సినిమాలలోకి వెళ్తారు తీరా ఎన్నికల సమయానికి వస్తారు అంటూ జోగినాయుడు తెలిపారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వెళ్లకుండా పూర్తిగా ప్రజలలో ఉండి ఉంటే కనుక పరిస్థితి మరోలా ఉండేదని జోగినాయుడు తెలియజేశారు. ఇలా ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago