Dhee 14: ఢీ షో నుండి వెళ్లిపోయిన జానీ మాస్టర్.. వీడియో వైరల్.. కంటెస్టెంట్ పర్ఫామెన్స్ పై అసంతృప్తి?
Dhee 14: బుల్లితెర మీద ఎన్నో రియాలిటీ షోలు ప్రసారం మొత్తం ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ టీవీలో ప్రసారం అవుతూ మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న షోలలో ఢీ డాన్స్ షో కూడా ఒకటి. ఈ డాన్స్ షో దేశవ్యాప్తంగా ఏంతో మంచి గుర్తింపు పొందింది. ఈ షో ద్వారా ఎంతోమంది డాన్సర్ లు గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
ప్రతి వారం ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ డాన్స్ షో లో అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ లతో పాటు ప్రదీప్, ఆదిమధ్య జరిగే సరదా సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఢీ షో ఇంత సక్సెస్ కావడానికి అధ్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో పాటు ప్రదీప్ ఆది వేసే పంచ్ డైలాగులు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు . ఈ ఢీ షో లో ప్రియమణి, నందిత శ్వేత తమ జడ్జిమెంట్ తో పాటు తమ అందంతో కూడా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
తాజాగా ఢీ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ వీడియోలో ఒక రష్యన్ భామ సందడి చేసింది. ఇలా ఆది ఆ రష్యా అమ్మాయితో పులిహోర కలపటానికి నానా తంటాలు పడ్డాడు. పుష్ప సినిమాలోని ఉ అంటావా మామ ఊ ఊ అంటావా మామ అనే పాట ఆమెతో పాడించటానికి ప్రయత్నం చేశాడు. ఇక డాన్స్ విషయానికి వస్తే ఈ ఎపిసోడ్ లో కంటెస్టెంట్ లు తమ డాన్స్ పర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపారు. అందరు గడ్డ స్టెంట్లు నువ్వా ? నేనా? అంటూ డాన్స్ తో పోటీ పడ్డారు.
ఇక ‘వందే మాతరం.. మనదే ఈ తరం’ అనే పాటకి చేసిన డాన్స్ చూసి జడ్జి లు ఫిదా అయ్యి లేచి నిలబడి సెల్యూట్ చేసారు. అయితే ఒక్కసారిగ ఢీ సెట్ లో వాతావరణం మారిపోయింది. అప్పటి వరకూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్న జానీ మాస్టర్ ఒక్కసారిగా చాలా సీరియస్ అయ్యాడు. ” ఢీ షో అనేది చాలా పవర్ ఫుల్.. చాలా సీరియస్ గా చెబుతున్నా.. పర్ఫామెన్స్ బాగాలేదు, కొరియోగ్రఫీ బాగాలేదు.. అసలు ఏదీ బాగాలేదు” అంటూ జానీ మాస్టర్ తన సీట్ నుండి లేచి వెళ్లిపోయారు. ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆతృత పడుతున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…