Josh Ravi : జబర్దస్త్ నుండి వచ్చి కమెడియన్ గా మంచి ఫేమ్ తెచ్చుకున్న జోష్ రవి జబర్దస్త్ కంటే ముందు నాగచైతన్య ‘జోష్’ సినిమాలో ఇండస్ట్రీ లో గుర్తింవు తెచ్చుకున్నాడు. చాలా సినిమాల్లో కమెడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచుకుంటూ ముందుకు వెళ్తున్న రవి ‘గుండె జారీ గల్లంతయ్యిందే’ సినిమాలో రైటర్ హర్షవర్ధన్ కి మధ్య చిన్న మనస్పర్తలు వచ్చినా ఆ సినిమాతో రవికి కమెడియన్ గా మంచి గుర్తింపు మాత్రం వచ్చింది. ఇక చిరంజీవి గారంటే ఎంతో ఇష్టమని, చిరంజీవి కోసం మాత్రమే ఇండస్ట్రీ కి వచ్చానంటూ చెప్తుంటాడు.
మీలో ఎవరు కోటీశ్వరుడు లో చేస్తున్నపుడు చిరు అలా అన్నారు…
చిరంజీవి గారిని ఎంతో మంది అనుకరించగలిగినా జోష్ రవి అంత బాగా ఎవరు చేయలేరని ఇండస్ట్రీ లో అనుకుంటారు అంటూ రవి చెబుతూ అలా మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో చిరంజీవి గారి సినిమా కెరీర్ లోని మైలురాల్లు నాతో స్కిట్స్ లాగా చేయించారు. అది నేను మర్చిపోలేను. అయితే షోలో చేస్తున్నపుడు మొదటి సారి చిరంజీవి గారిని కలవడం మాట్లాడటం జరిగింది, ఆనందం తట్టుకోలేక పోయాను. అమ్మ నాన్న తరువాత నాకు చిరంజీవి గారే దేవుడు అలాంటి వ్యక్తిని కలవడంతో ఆ రోజుని వర్ణించలేను అంటూ చెప్తునే ఆ షోలో హోస్ట్ గా అనసూయ వచ్చారు షూటింగ్ ఎక్కువ ల్యాగ్ అవ్వడంతో నా షూటింగ్ పార్ట్ వాయిదా పడింది.
అప్పుడే సినిమాల్లో ఇంకా అవాకాశాలు వస్తున్నాయి, ఈ అవకాశం వదులుకోలేను అలా అని సినిమాల్లోను వదులుకోలేని పరిస్థితి. అప్పుడు చిరంజీవి గారు నా పరిస్థితి అర్థం చేసుకుని అక్కడి టీం కి ఒకటే చెప్పారు ఇతని డేట్స్ కి అడ్జస్ట్ అయ్యేలాగా మనకు కుదిరేలా ప్లాన్ చేయండి అంటూ చెప్పారు, ఆ రోజుని మర్చిపోలేను. ఇక వచ్చిన అవకాశం అందులోనూ నా అభిమాన హీరోతో అయ్యేసరికి ఒక్క షాట్ కుడా వృధా చేయకుండా ఎడిట్ చేసే వీలు కూడా ఇవ్వకుండా నటించాను అంటూ చిరంజీవి గారి మీదున్న అభిమానాన్ని చెప్పారు జోష్ రవి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…