Categories: FeaturedMovie News

Pulsar bike song Jhansi : పల్సర్ బైక్ పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఝాన్సీ.. గంజి అన్నం ఆవకాయ తిని.. డాన్సర్ అంటే చులకనగా చూడొద్దు..!

Pulsar bike song Jhansi : ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రతిసారి కొత్తవాళ్ళను తీసుకుని వచ్చి ప్రోత్సహిస్తూ ఉంటారు. అలానే ఈసారి కూడా ‘పల్సర్ బైక్’ అనే జానపద గీతానికి స్టెప్పులతో ఆదరగొట్టి ఒక్కసారిగా ఫేమస్ అయింది గాజువాక డిపో కండక్టర్ ఝాన్సీ. ఆమె డాన్స్ కి సంబందించిన ప్రోమో విడుదల అయిన కాసేపటికే బాగా పాపులర్ అయింది ఝాన్సీ. ఇక చాలా యూట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూ లంటూ బిజీ అయిపోయారు ఝాన్సీ. ఇక ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు అన్నింటి గురించి ఇంటర్వ్యూ ల్లో పంచుకున్నారు.

గంజి అన్నం అవకాయతో బతికిన రోజులు ఉన్నాయి…

ఇక ఝాన్సీ చిన్నతనంలోనే తల్లి తండ్రులు గొడవపడి విడిపోయారు. ఇక తల్లి ఝాన్సీ, అలాగే తమ్ముడిని సాకింది. తండ్రి వదిలేసి వెళ్లిపోయినా తల్లి కష్టపడి పెంచిందని చెప్పారు ఝాన్సీ. కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించి పిల్లలను చదివించింది. ఇక ఎనిమిదో తరగతి నుండే డాన్స్ నేర్చుకుని స్టేజి పెర్ఫార్మన్స్ ఇచ్చేదాన్ని అంటూ చెప్పారు. అప్పుడు 150 రూపాయలు ఒకసారి డాన్స్ చేస్తే ఇచ్చేవారు అలా డాన్స్ నేర్చుకుంటూ పెర్ఫార్మన్స్ ఇస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాను. ఇక కండక్టర్ గా జాబ్ వచ్చాక కుటుంబ బాధ్యత తీసుకుని తమ్ముడిని ఎంబిఏ చదివించానని ఇపుడు తాను మంచి ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడని చెప్పారు ఝాన్సీ. తండ్రి వదిలేస్తే డాన్స్ చేసి కుటుంబాన్ని పోషించానని నేనేం తప్పు పని చేయలేదు, దొంగతనం లాంటివి చేయలేదని డాన్స్ చేసే అమ్మాయిలను తక్కువగా చూడకండి అంటూ చెప్పారు.

ఇక ఇంటర్ లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఝాన్సీ భర్త కూడా డాన్సరే. ఇద్దరూ కలిసి ఎన్నో కాంపిటిషన్స్ లోనూ పాల్గొన్నారు. జెమినీ టీవీ, మా టీవీ ఇలా చాలా ఛానెల్స్ డాన్స షోలలో పాల్గొన్నా ఝాన్సీ కండక్టర్ గా పని చేస్తూనే తన డాన్స్ ప్రోగ్రామ్స్ ని కూడా చేస్తోంది. ఇక జెమినీ టీవీ లో వచ్చిన డాన్స్ షో ద్వారా చిరంజీవి ని కలిసినపుడు చాలా ఆనందంగా అనిపించింది అంటూ చెప్పిన ఝాన్సీ ‘శ్రీ దేవి డ్రామా కంపెనీ’ లో అందరితో కలిసి డాన్స్ చేయడం మంచి అనుభూతిని మిగిల్చిందని చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago